ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసం సంధర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఆదివారం (11-07-2021) ఉదయం 07 గం.ల నుండి 08 గం.ల మధ్య ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది శ్రీ అమ్మవారికి మొదటి సారె సమర్పించుటకు విచ్చేయనుండగా, ఆలయ చైర్మన్ స్వాగతం పలకనున్నారు. ఆలయ వైదిక కమిటీ వారు సమర్పించు సారె తో శ్రీ అమ్మవారి ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం ప్రారంభించబడునని ప్రకటనలో తెలిపారు. శ్రీ అమ్మవారికి ఆషాడ సారును సమర్పించ దలచినవారు సంప్రదించవలసిన నెంబర్లు 9493545253, 8341547300 లను ఆఫీస్ వేళల యందు మూడు రోజులు ముందుగానే సంప్రదించి సమస్థ వివరములు, ఊరు, భక్తుల సంఖ్య, తదితర వివరాలను నమోదు చేసుకొనవలసినదిగా తెలియజేశారు. శ్రీ అమ్మవారికి ఆషాఢ సారె ను సమర్పించుట కు విచ్చేయు భక్తులు తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనలను పాటించుచూ క్యూ లైన్ ల యందు భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజర్ ని ఉపయోగిస్తూ శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయవలసిందిగా తెలిపారు.
Tags indrakiladri
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …