ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ లో భాగముగా “కోవిడ్ టీకా అవేర్నెస్.. అలాగే నో మాస్క్ నో ఎంట్రీ” కార్యక్రమంలో భాగముగా శనివారం శ్రీ అమ్మవారి దేవస్థానం నందు యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు ని కలిసి, కార్యక్రమ వివరములను తెలిపారు. అనంతరం మహామండపం గ్రౌండ్ ఫ్లోర్ నందు రాంబాబు ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి భక్తులకు కోవిడ్ జాగ్రత్తలు, టీకాపై అవగాహన, సామాజిక దూరం మరియు మాస్క్ యొక్క ప్రాముఖ్యతపై భక్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోయునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు కోళ్ల రవి బాబు, యు.సుబ్బరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags indrakiladri
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …