Breaking News

ఇంతవరకు 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు…

-జెసి డా. కె. మాధవీలత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాల రబీ ధాన్యం కొనుగోలు భాగంగా ఇంతవరకు 33,330 రైతుల నుంచి 3,82,853 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 20 మంది రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 33,330 మంది రైతుల నుంచి రూ.660 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇందులో ఇప్పటికే రూ. 344.72 కోట్లను రైతులకు చెల్లించగా మరో రూ. 315.63 కోట్లను రైతులకు చెల్లించేందుకు అమోదించడం జరిగిందని త్వరలో సంబంధిత రైతుల ఖాతాలకు జమ చేయబడుతుందన్నారు. జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామం నుంచి రామకృష్ణారెడ్డి, నాగాయలంక నుంచి కార్తీక్ మాట్లాడుతూ తమ ప్రాంతాలలో ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై జేసి మాధవిలత మాట్లాడుతూ ఆ మండలాలలో రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతు నుంచి ధాన్యం కొనుగోళ్ళ చేయ్యమని సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రైతు తమ సమీపంలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ధాన్యం విక్రయించుకోవచ్చుని
జాయింట్ కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా రైతులందరు తాము పండించిన రబీ ధాన్యమును ఇంకనూ విక్రయించవలసి యున్న యెడల ఈ నెల జూలై 25 లోగా సత్వరమే సంబంధిత రైతు భరోసా కేంద్రాలలో తమ ధాన్యమును విక్రయించవలసిందిగా జెసి కోరారు. జి. కొండూరు మండలం నుంచి శ్రీనివాసరావు, మైలవరం నుంచి నాగరాజు, రాంబాబు, మదినేపల్లి నుంచి నాగ సురేశ్, పెనమలూరు నుంచి రామబ్రహ్మం, స్వామి నాయుడు, విజయవాడ రూరల్ నుంచి హారిక, సాంబశివరావు, రామ కోటేశ్వరరావు, తిరువూరు నుంచి బలవేశ్వరరావు, ఇందిర, పెనుగంచి ప్రోలు నుంచి నాగభూషణం పెడన నుంచి ఉమామహేశ్వరరావు, జగ్గయయ్యపేట నుంచి బ్రహ్మయ్య, జిలానీ సాహెబ్, చాట్రాయి నుంచి ప్రదీప్, కంకిపాడు నుంచి నాగశిరోమణి గంపలగూడెం నుంచి వేంకటేశ్వరరావు తదితరులు తాము విక్రయించిన ధాన్యానికి వెంటనే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోమని కోరారు. దీనిపై జేసి స్పందిస్తూ త్వరలోనే సంబంధిత సొమ్ము జమ చేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ కె.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమాజ సేవలో స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్యం కావాలి

-కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *