విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును మెరుగుపరచి మరింత సమర్థవంతంగా రోగులకు ఆక్సిజన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను జాయింట్ కలెక్టర్లు ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో 10కెఎల్ 12కెఎల్ 20 కెఎల్ సామర్ధ్యం గల ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయన్నారు. గతంలో ఫణి గ్రీష్ ఏజెన్సీ ఆక్సిజన్ ప్లాంట్ నిర్వహణను చూసేదన్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో ఆక్సిజన్ ప్లాంట్ సామర్థ్యంతో పాటు పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉ ందన్నారు. ఆక్సిజన్ నిల్వ సరఫరా సమయంలో ప్లాంట్ కు ఐస్ పట్టినపుడు కరిగించేందుకు పైపుల ద్వారా నీటిని వినియోగిస్తున్నారని అయితే వాటి స్థానంలో స్పింక్లర్స్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్ వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ప్రాంగణం చూట్టూ ఫెన్సింగ్ ను నిర్మించాలన్నారు. ప్రస్తుత ప్లాంట్ నుండి ఆసుపత్రి లోపలి వరకు ఆక్సిజన్ సరఫరా చేసే పైపు లైన్ కు అదనంగా మరో పైపు లైన్ ను ఏర్పాటు చేసి రోగులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద జనరేటర్ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న జనరేటర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన తెలిపారు. అనంతరం కోవిడ్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఆయన వైద్య అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాధి తగ్గి నెగిటివ్ రిపోర్టు వచ్చిన రోగులలో ఆక్సిజన్ స్థాయి పెరిగేవరకు ఆక్సిజన్‌ను అందించవలసి వస్తుందన్నారు. అటువంటి వారిని గుర్తించి ప్రత్యేకంగా ఆక్సిజన్ వార్డును ఏర్పాటు చేసి చికిత్సను అందించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి పరిశీలనలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె. మోహన్ కుమార్, జిజిహెచ్ సూపరింటెండెంట్ శివశంకర్, ఎపియంఎస్ఏడిసి ఈఈ ప్రవీణ్ రాజ్ ఎపిసిడిసిఎల్ ఎడి జె. బాలజీ, ఆసుపత్రి ఎఇ జి. ప్రవీణ్ వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అవగాహన ఒప్పందం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యా సంస్థ ప్రధాన కార్యాలయం, తాడేపల్లి, …