గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధి కాకుమానువారితోటలో ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు కేటాయించిన స్థలాన్ని 3 రోజుల్లో సమగ్ర సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఆదివారం కమిషనర్ కాకుమానువారితోటలోని స్థలాన్ని ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ పరిశీలకులు డాక్టర్ రమేష్, జిఎంసి, సిపిడిసిఎల్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత మ్యాప్ ద్వారా మొత్తం ఎంత స్థలం, అందులో ఎంత స్థలం జిజిహెచ్ కి కేటాయింపు జరిగింది, ప్రస్తుతం స్థలం ఎలా ఉంది పరిశీలించి, మాట్లాడుతూ కాకుమానువారితోటలో ప్రభుత్వ వైద్యశాలకు కేటాయించిన 6 ఎకరాల స్థలంలో ప్రస్తుతం కొంత ఆక్రమణలు జరగడం, పిచ్చి మొక్కలు పెరిగి ఉందన్నారు. రాబోఉ 3 రోజుల్లో జిఎంసి పట్టణ ప్రణాళిక అధికారుల నేతృత్వంలో సర్వేయర్లు సదరు 6 ఎకరాల స్థలాన్ని సమగ్రంగా సర్వే చేసి, బౌండరీలు ఫిక్స్ చేయాలని ఆదేశించారు. బౌండరీలు ఫిక్స్ చేసిన అనంతరం ఆక్రమణలను, పిచ్చి మొక్కలను తొలగించేందుకు జాయింట్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. సదరు స్థలంలో భవిష్యత్ లో ఆక్రమణలు జరగకుండా జిజిహెచ్ షుమారు రూ.90 లక్షలతో ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు ప్రభుత్వ వైద్యశాలకు కేటాయించిన స్థలంలో ప్రజారోగ్య కార్మికులు లేదా చుట్టుపక్కల నివాసితులు వ్యర్ధాలు, చెత్త వేయకుండా అవగాహన కల్గించాలని ఆదేశించారు.
అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్ లో ఓసి కోసం దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తుల భవనాలను పరిశీలించి, నిబందనల మేరకు నిర్మాణాలు జరగాలని, ర్యాంప్ లు రోడ్ మీదకు రాకుడదని, సెట్ బ్యాక్ లో జనరేటర్లు, ఇతర అడ్డంకులు ఉండకూడదని స్పష్టం చేశారు.
పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఎస్.ఈ. నాగమల్లేశ్వరరావు, బయాలజిస్ట్ మధుసూదన్, ఎంహెచ్ఓ రామారావు, ఈఈ కోటేశ్వరరావు, సిపిడిసిఎల్ ఈఈ శ్రీనివాసబాబు, ఏసిపి ఫజులూర్ రెహ్మాన్, తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …