-కలక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, తాడేపల్లి గూడెం వారీ ఆధ్వర్యంలో 13 మంది దివ్యాంగులకు వినికిడి, ఉపకరణాలు పంపిణి కలెక్టర్ పి ప్రశాంతి చేతుల మీదుగా చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దివ్యాంగులకి కాలిపార్స్, వినికిడి పరికరాలు తదితరాలు పంపిణి చేసి మరింత మందికి స్ఫూర్తి నివ్వడం జరిగిందన్నారు. ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలలో ప్రజలు కూడా తమవంతుగా భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. ముగ్గురు పిల్లలకి 3 జతల వినికిడి ఉపకరణాలు, పది మంది దివ్యాంగులకి 10 జతల కాలిపర్స్, ఒక సిపి చైర్, 9 వాకర్లు , ఒక కృత్రిమ కాలు అందజేయడం జరిగింది. సుమారు రూ.3 లక్షల యాభైవేల ఖరీదైన ఉపకరణాలు అందజేసినట్లు సొసైటీ అధ్యక్షులు వై ఎస్ జే మోజీస్, ఉపాధ్యక్షులు డా వై ఐజక్ లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, సొసైటీ అధ్యక్షులు వై ఎస్ జే మోజీస్, ఉపాధ్యక్షులు డా వై ఐజక్ లు, దివ్యాంగులు పాల్గొన్నారు.