– అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక సదుపాయాలతో ప్రత్యేక విభాగం
– ప్రారంభోత్సవ సందర్భంగా 50% రాయితీతో బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంటివ్ ప్యాకేజీ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్
– చికిత్సలందించడంతో పాటు, వ్యాధి నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
మెదడు, వెన్నెముక సంబంధిత వ్యాధులకు విశేష వైద్య చికిత్సలందిస్తున్న నాసా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఆధునిక జీవన విధానాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడుల కారణంగా ఎక్కువ మంది ప్రజలు మెదడు, వెన్నెముక సంబంధిత సమస్యలు, మరీ ముఖ్యంగా.. బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం)కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, నాసా హాస్పిటల్స్ ఓ ప్రత్యేక విభాగాన్ని సిద్దం చేసింది. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక సదుపాయాలతో కాంప్రహెన్సివ్ బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ ను ప్రారంభించినట్లు నాసా హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రియాజ్ తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ నందు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెదడు, వెన్నెముక సంబంధిత సమస్యలకు ప్రత్యేకంగా చికిత్సలందించేందుకు ఈ అత్యధునాతన బ్రెయిన్ స్ట్రోక్ సెంటరును ఆవిష్కరించామని అన్నారు. ఎల్.బి.నగర్ మెయిన్ రోడ్డు చింతల్ కుంటలోని నాసా హాస్పిటల్స్ నందు ఈ సెంటర్ ను ప్రారంభించామని తెలిపారు. ప్రఖ్యాత స్పైన్ సర్జన్ జి.పి.వి. సుబ్బయ్య, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ వెనిగళ్ల నవీన్ కుమార్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ వి. శ్రీధర నారాయణ, డాక్టర్ వెణుతురుమిల్లి రాకేష్, డాక్టర్ ఎం. కార్తీక్, డాక్టర్ కె. పృథ్వీ రాజ్ తదితర నిష్ణాతులైన వైద్య నిపుణులు ఈ సెంటర్ నందు సేవలందిస్తారని వెల్లడించారు. కాంప్రహెన్సివ్ బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ ప్రారంభోత్సవ సందర్భంగా, బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంటివ్ ప్యాకేజీలు, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లపై 50 శాతం రాయితీ అందిస్తున్నామని డాక్టర్ రియాజ్ ప్రకటించారు. నాసా కాంప్రహెన్సివ్ బ్రెయిన్ స్ట్రోక్ యూనిట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెనిగళ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ.. నూతన విభాగం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్, సీజర్స్, పార్కిన్సన్స్, డైమెన్షియా, మెడ నొప్పి, వెన్ను నొప్పి, తల నొప్పి, మెనింగిటిస్ తదితర సమస్యలకు ఆధునిక చికిత్సలను అందిస్తామని అన్నారు. వ్యాధులను నయం చేసేందుకు చికిత్సలందించడంతో పాటుగా, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అవసరమైన నియంత్రణ చర్యలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు. బ్రెయిన్ స్ట్రోక్ నుంచి ప్రజలను రక్షించేందుకు ‘బీ ఫాస్ట్’ ప్రోగ్రాంను రూపొందించామని డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పక్షవాతం బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యవంతం చేస్తున్నామని వివరించారు. శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం, కంటి సమస్యలు, ముఖంలో అసాధారణ మార్పులు, చేతులు బలహీనమవడం, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు బ్రెయిన్ స్ట్రోక్ సూచనలు కావచ్చని అన్నారు. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలని సూచించారు. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన మూడు గంటల వ్యవధిలోగా ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా పక్షవాతం ముప్పును తప్పించవచ్చని చెప్పారు. మెదడు వెన్నెముక సమస్యలు, న్యూరో ఐసీయూ, బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలతో పాటు, వ్యాధి నియంత్రణ సేవలు, రిహేబిలిటేషన్ సదుపాయాలు ఈ సెంటర్ నందు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ నవీన్ కుమార్ పేర్కొన్నారు.