విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శన మరియు అమ్మకానికి జింఖానా గ్రౌండ్స్ వద్ద గల అనుగ్రహ దేవి గుడి వద్ద, పటమట రైతు బజార్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మెప్మా అర్బన్ మార్కెట్ను యు సి డి విభాగం వారు ఏర్పాటు చేశారు. ఈ మెప్మా అర్బన్ మార్కెట్లో స్వయం సహాయక బృందం మహిళలందరూ తాము తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించటమే కాకుండా ఉత్సాహభరితంగా అమ్మకాలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఏర్పాటు చేస్తున్న మెప్మా అర్బన్ మార్కెట్ ద్వారా మహిళా సాధికారతమే కాకుండా మహిళలకు ఆర్థికంగా స్థిరపడే అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన మెప్మా అర్బన్ మార్కెట్లో ఇంచార్జ్ పి వో యు సి డి మరియు జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్లత, యు సి డి సిబ్బంది తదితరులు సందర్శించారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …