Breaking News

ఒక మహిళను చైర్ పర్సన్ గా నియమించడం సీఎం జగన్ ఆలోచనా విధానానికి నిదర్శనం…


-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు

కలిడింది, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంతో చరిత్ర కలిగిన కలిదిండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి తొలిసారిగా ఒక మహిళను చైర్ పర్సన్ గా నియమించడం ముఖ్యమంత్రి జగనన్న ఆలోచనా విధానానికి నిదర్శనం అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కలిదిండి పిఏసిఎస్ ఛైర్ పర్శన్ ఊర కళ్యాణి, సభ్యులు, గొరిపర్తి వెంకటరెడ్డి, కమతం పరాంకుశం  అభినందన సభలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యేకి కలిదిండి సెంటర్ లో ఘనస్వాగతం పలికి అక్కడి నుంచి కళ్యాణి ఫంక్షన్ హాల్ వరకు భారీ ఊరేగింపుగా తోడ్కొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డిఎన్నార్ మాట్లాడుతూ కలిదిండి మండలంలో 9 ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉంటే 3 పిఏసిఎస్ లు దళిత సోదరులకు. అలాగే ఇద్దరు మహిళలకు, మిగతావి ఇతర సామాజిక వర్గాలకు కేటాయించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగానే కలిదిండి పట్టణ పిఏసిఎస్ బ్యాంక్ మొట్ట మొదటి మహిళా ఛైర్ పర్శన్ గా సోదరి ఊర కళ్యాణిశ్రీధర్ ని నామినేట్ చేశామని, ఈరోజు అభినందన సభలో పాల్గొనటం చాలా సంతోషంగా వుందని అన్నారు. ముఖ్యంగా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి  ఆదేశాలు మేరకు సొసైటీ బ్యాంక్ ఛైర్ పర్శన్లుగా ఎంపిక చేసి వారికీ పూర్తి బాధ్యతలు ఇవ్వడం జరిగింది అని, ఈ యొక్క సొసైటీ బ్యాంక్ ఛైర్ పర్శన్ మరియు సభ్యులు బ్యాంక్ పరిధిలోని రైతులకు పూర్తి అందుబాటులో వుంటూ వారికీ మేలు చేయాలని, బ్యాంక్ ను అభివృద్ధిపథంలో నడపాలని కోరారు. సోదరి ఊర కళ్యాణిశ్రీధర్ ఛైర్ పర్శన్ గా, మంచి పేరు తెచ్చుకోవాలని, జగనన్న ఆశీస్సులుతో మంచి నాయకురాలుగా ఎదగాలని డిఎన్నార్ అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు స్థానిక సంస్థల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం మహిళలకు కేటాయించి అక్కచెల్లమ్మలకు ఇవ్వడం జరుగుతుంది అని, అదేవిదంగా అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తూ నేరుగా అక్కచెల్లమ్మలకు ఖాతాలలో డబ్బులు వేస్తున్నారు అని, రాష్ట్రంలో 30 లక్షల 64 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నాం అని, ఇది మహిళలకు మన ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ను తెలుపుతుంది అన్నారు. ముఖ్యంగా జగనన్న ఎన్నికల ముందు ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలను నేరుగా చూసి, విని, అధికారంలోకి రాగానే నవరత్నాల తేదీల వారీగా అమలు చేస్తూ రాష్ట్రంలో అక్కచెల్లమ్మలకు శత రత్నాలు ఇస్తున్నారు అని అన్నారు. అదేవిదంగా నాకు నా కుటుంబానికి ఎక్కువగా ఆర్యవైశ్య కుటుంబాలతో అనుబంధం ఉందని, వారంటే తనకు ఎనలేని అభిమానం అని, వారు మాట ఎప్పుడు తప్పరు అని అన్నారు. పాత రాజకీయాలకు స్వస్తీ పలికి నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టామని డిఎన్నార్ అన్నారు. ఊర కళ్యాణి రైతులకు ఎప్పుడు అందుబాటులో వుంటూ, మంచి పేరు తెచ్చుకొని, పదవిని ఇచ్చిన జగనన్నకు మంచి పేరు తేవాలని అన్నారు. ముఖ్యంగా కలిదిండి ప్రాంతానికి ఒక ల్యాండ్ మార్క్ గా ఉండే శ్రీ పాతాళ భోగేశ్వరస్వామి వారి ఆలయ 108 అడుగుల గాలిగోపురం ను రూ. 2.5 కోట్ల వ్యయంతో నిర్మించడానికి గాను ఆగస్టు మాసంలో భూమిపూజ చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం బ్యాంక్ చైర్ పర్సన్ ఊర శ్రీధర్ కళ్యాణి మాట్లాడుతూ వారి సామాజిక వర్గాన్ని నియోజకవర్గంలో ఇప్పటి వరకు చాలా మంది రాజకీయంగా వాడుకొని వదిలేసారు అని కలిదిండి మండలంలో మొట్ట మొద్దటి సారిగా ఎమ్మెల్యే డిఎన్నార్ సొసైటీ ఛైర్ పర్శన్ గా పదవీ ఇవ్వడం చాలా సంతోషం అని, జీవితాంతం ఎమ్మెల్యే డిఎన్నార్ కి రుణ పడి ఉంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ  చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి చందన ఉమామహేశ్వరరావు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఐనాల బ్రహ్మజీ, పిఏసిఎస్ అధ్యక్షులు, అంకెం నరసయ్య, దాసరి చార్లెస్, నామాని అన్నవరం, కురేళ్ళ రాజారత్నం, పోనిపిరెడ్డి శ్రీనివాసరావు, సాగి సూర్యనారాయణరాజు, వడ్లాని వెంకట పార్థసారధి, ఎంపీటీసీ అభ్యర్థులు, నీలి సుమన్, మహ్మద్ చాన్ బాషా, సర్పంచ్ లు, ముత్తిరెడ్డి సత్యనారాయణ, సాన మీనా సరస్వతి, మహాదేవ విజయబాబు, మోకా రామకృష్ణ, అనపర్తి వడ్డికాసులు, బత్తిన ఉమామహేశ్వరరావు, నరహరశెట్టి నరసయ్య, నాయకులు, చెన్నంశెట్టి కోదండరామయ్య, చెన్నంశెట్టి నాగరాజు, గొరిపర్తి సుబ్బారావు, చిట్టూరి బుజ్జి, పడవల శ్రీనివాస్, సానా వెంకటరామారావు, నున్న కృష్ణబాబు, గోదావరి సత్యనారాయణ, వడుపు రామారావు, కొల్లాటి సత్యనారాయణ, భాస్కర వెంకటేశ్వరరావు, వేమూరి బుజ్జి, పంజా రామారావు, వడ్డి గంగరాజు, పోతుమర్రు కిట్టు, కందుల వెంకటేశ్వరరావు, పోసిన రాజ్ భరత్, షేక్ చాన్ బాషా, కట్టా లక్ష్మణరావు, కోకా తాతాజీ, రావడి బాలు, ఇమ్మానేని లక్ష్మణరావు, గుడివాడ ఫణి, చెన్నంశెట్టి సోమేశ్వరరావు, పోతురాజు లక్ష్మణ్, నున్న రామచంద్రరావు, వాసురాజు, ప్రాన్సిస్, మెండ నవీన్, చెన్నంశెట్టి మతారావు, మారుబోయిన విష్ణు, బోయిన రామకృష్ణ, చక్కా జగన్, దొడ్డాకుల పండు, తలారి వీరుళ్లు,పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *