Breaking News

బోట్స్ మ్యాన్ సొసైటి లకి అనుమతి ఇచ్చిన రీచేస్ లో త్రవ్వకాలు ప్రారంభించాల్సి ఉంటుంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం నాటికి బోట్స్ మ్యాన్ సొసైటి లకి అనుమతి ఇచ్చిన రీచేస్ లో త్రవ్వకాలు ప్రారంభించాల్సి ఉంటుందనీ, ఆమేరకు త్రవ్వకాలు ప్రారంభించని వాటికీ సంబంధించి అనుమతులు రద్దు చేయాల్సి ఉంటుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం డి ఎల్ ఎస్ కమిటి సమావేశానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానం అమలులో మరిన్ని సంస్కరణలను తీసుకుని రావడం జరిగిందన్నారు. వినియోగదారులకి, ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు , ఇతర నిర్మాణ, అభివృద్ది పనులను చెపట్టేందుకు అవసరమైన ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. డి సిల్టేషన్, ఓపెన్ రీచేస్ వద్ద సంబంధిత ఏజెన్సీస్ నిర్వహణలో రీచ్ ల నిర్వహణా ఉండాలన్నారు. వోల్టా చట్ట పరిధిలో ఇసుక త్రవ్వకాలు జరపాల్సి ఉంటుందని , ఇసుక రవాణా, ఇతర ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయి లో సంబంధిత ఏజెన్సీస్ నిర్వహణలో చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు.

రీచ్ ల నిర్వహణ కోసం రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ పరిధిలో రేపు ఉదయం ఒక డివిజన్ లో మధ్యాహ్నాం మరో డివిజన్ లో శిక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. జీవో నెంబర్ 66 , తేది.25.10.2024 ఇసుక లభ్యతను పెంపొందించడానికి మరియు ఇతర నిర్మాణ రంగాన్ని పెంచడానికి మరియు ఉచిత ఇసుకను ఇబ్బంది లేని సరఫరా కోసం ప్రక్రియలను మెరుగుపరచడానికి సవరించిన ఉచిత ఇసుక విధానం 2024 మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. దీనికి సంబంధించి, జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలిపారు. చట్టబద్ధమైన విధుల మినహాయింపులో భాగంగా ఇసుకపై సీనరేజ్ ఫీజు, త్రవ్వకాలు, రవాణా, లోడింగ్, పరిపాలన వ్యయం పై జి ఎస్ టి పూర్తిగా మినహాయించి నట్లు తెలిపారు. తద్వారా రాష్ట్ర నిర్మాణ రంగాన్ని ఉత్తేజపరిచేందుకు, ఇన్‌పుట్ వ్యయాన్ని తగ్గించడానికి మరియు తద్వారా రాష్ట్ర GSDP మరియు ఉపాధిపై సానుకూల గుణకార ప్రభావానికి దారితీసేందుకు మినహాయించినట్లు తెలియ చేశారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఇసుక కమిటీ చేసిన తీర్మానాల ప్రకారం రీచ్ ల వద్ద నిర్ణయించిన ఇసుకకు ఈ క్రింది విధంగా ధరలు వర్తించనున్నట్లు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

చట్టబద్ధమైన విధుల మినహాయింపు నేపధ్యంలో ప్రస్తుతం ఒక మెట్రిక్ టన్ను స్టాక్‌యార్డ్ వద్ద – రూ.270/- లను రూ.150/-గా తగ్గించడం జరిగింది. డి-సిల్టేషన్ ర్యాంపుల వద్ద రూ.345 నుంచి రూ.229కి తగ్గించబడింది..ఒపెన్ రీచేస్ (బహిరంగ ) ఇసుక రూ.220 నుంచి రూ.118కి తగ్గించినట్లు తెలిపారు. ఇందుకు సమాంతరంగా జిల్లాలోని 16 ఒపెన్ రిచ్ లలో సవరించిన రేట్ల ప్రకారం ధరలను నిర్ధారించినట్లు, వాటిని ఆయా ఓపెన్ రిచ్ లలో ప్రముఖంగా ప్రదర్శించాలని తెలియ చేశారు. స్థానిక సంస్థల ప్రాంతాలలో ప్రవాహాలకు ఆనుకుని ఉన్న స్థానికుల కోసం ఇసుక వెలికితీత వివరాలు గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించాలన్నారు. వినియోగదారుల కోసం ఇసుక వెలికితీత సాధారణ, బల్క్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. DLSC ద్వారా అవసరమైన అన్ని అనుమతులు కలిగి ఉన్న అధీకృత సరఫరా పాయింట్ల (రీచ్‌లు/డి-సిల్టేషన్ పాయింట్లు మొదలైనవి) నుండి ఇసుకను యాక్సెస్ చేయాల్సి ఉంటుందన్నారు. మైన్స్ విభాగం అభివృద్ధి చేసిన అప్లికేషన్ / పోర్టల్‌లో అధీకృత సరఫరా పాయింట్ల వద్ద నమోదు చేసుకోవాలి మరియు ఉచిత ట్రాన్సిట్ ఫారమ్‌ను పొందాల్సి ఉంటుందన్నారు. ఆఫ్ లైన్, ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకున్న తర్వాత, ఇన్‌ఛార్జ్ నుండి డెలివరీ తేదీ మరియు సమయ స్లాట్ తీసుకోవచ్చు. ట్రాన్స్‌పోర్టర్ నిర్ణీత స్లాట్‌లోని రీచ్‌ను చేరుకోవాలి మరియు ఇసుకను తన స్వంత మాన్యువల్ కార్మికులను ఉపయోగించి నేరుగా రీచ్ నుండి లోడ్ చేయవచ్చు లేదా నిర్దిష్ట సరఫరా పాయింట్ కోసం DLSC ఎంపిక చేసిన ఏజెన్సీ నుండి సహాయం తీసుకోవచ్చు, దీని కోసం నిర్దేశించిన ప్రకారం సొమ్ము నేరుగా ఏజెన్సీస్ కే చెల్లించాలి. ఆమేరకు DLSC నిర్ణయించిన ధరల ప్రకారం వినియోగదారు/ రవాణాదారు నేరుగా ఎంచుకున్న ఏజెన్సీకి రసీదు/ఇన్‌వాయిస్‌ని పొందాల్సి ఉంటుందన్నారు. రీచ్ మేనేజ్‌మెంట్ ద్వారా అనుమతించబడిన అన్ని ఇసుక సరఫరా పాయింట్లు సంభందిత ఏజెన్సీ ల ద్వారా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వాటి నిర్వహణా వ్యవస్థ, మానవ వనరులను ఆయా ఏజెన్సీల ద్వారా మాత్రమే చేపట్టాల్సి ఉంటుందన్నారు. ట్రాక్టర్లు ద్వారా నేరుగా ఓపెన్ రిచ్ ల నుంచి ఇసుక తీసుకుని వెళ్ళల్సి ఉంటుందనీ, జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో న్యాయమైన మరియు పారదర్శక ప్రక్రియ పై విజిలెన్స్ చేపట్టాల్సి ఉంటుందన్నారు. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈమేరకు నిర్లిప్తత విడనాడి నిబద్ధత కలిగి విధి నిర్వహణలో బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ట్రాక్టర్లు ద్వారా నేరుగా ఓపెన్ రిచ్ లనుంచి తీసుకొని వెళ్ళవచ్చు అని స్పష్టం చేశారు. మల్లెశ్వరం ఒపెన్ రిచ్ సంబందించి కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న దృష్ట్యా ఉత్తర ప్రత్యుత్తరాలు ఆమేరకు జరపాలని నిర్ణయించారు. ఇతర జిల్లాలకు సరఫరా చేసేందుకు మైన్స్ ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చెయ్యడం పై నిర్ణయం తీసుకున్నారు. రీచేస్ నిర్వహణా కోసం 9 డి సీల్టేషన్, 16 ఒపెన్ రిచ్ లకు ఏజెన్సీస్ ఎంపిక పై చర్యలు పై మైన్స్ అధికారి కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఆర్డీవోలు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, ఏడి మైన్స్ డి ఫణి భూషణ్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్, జిల్లా భూగర్భ జలాల అధికారి వై శ్రీనివాస్, సహాయ పర్యావరణ అధికారి ఏ. రామచంద్ర మూర్తి, ఇరిగేషన్ ఈ ఈ – ఆర్ కాశీ విశ్వేశ్వరరావు, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ బీవీ గిరి , ఆర్ అండ్ బి ఈ ఈ ఎస్ బి వి రెడ్డి, మైన్స్ అధికారి విఘ్నేష్ లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *