-వాల్మీకి సేవా సంఘం అధ్యక్షులు బరిగె నరసింహారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) నాయకత్వాన్ని బలపరుస్తామని విజయవాడ వాల్మీకి (బోయ) సేవా సంఘం అధ్యక్షులు బరిగె నరసింహారావు అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే దిశగా రాజకీయ పార్టీలు కృషి చేయాలని భీమన వారి పేట మహర్షి వాల్మీకి భవన్ లో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విజయవాడ వాల్మీకి (బోయ) సేవా సంఘం అధ్యక్షులు బరిగె నర్సింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, వాల్మీకి (బోయ) సేవా సంఘం ఉపాధ్యక్షులు ఎం కృష్ణమూర్తి, సెక్రటరీ సిహెచ్ సాంబశివరావు, కోశాధికారి సిహెచ్ వి వరప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బరిగే నర్సింహారావు మాట్లాడుతూ వాల్మీకుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి కు వాల్మీకుల సామాజిక వర్గం తరపున మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. వాల్మీకి నాయకులు, కార్యకర్తలు, కులస్తులతో సమావేశం ఏర్పాటు చేశామని కూటమి ప్రభుత్వంతోనే వాల్మీకులకు న్యాయం జరుగుతుందని భావించి అందరం కలిసి ఎమ్మెల్యే సుజనా నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వాల్మీకుల సామాజిక వర్గం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.