Breaking News

తిరుపతి జిల్లాకు చేరుకున్న రైల్వే శాఖపై స్టడీ టూర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

-రైల్వే శాఖపై సిఎం. రమేష్ సారథ్యంలోని స్టడీ టూర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రేణిగుంట రైల్వే స్టేషన్ నందు ఘన స్వాగతం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వే శాఖ పై ఆన్ ది స్పాట్ స్టడి టూర్ నిమిత్తం తిరుపతి జిల్లాకు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి ఆదివారం సాయంత్రం దురంతో ఎక్స్ప్రెస్ రైలులో సిఎం రమేష్ సారథ్యంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకున్న వీరికి సౌత్ సెంట్రల్ రైల్వేస్ జీఎం అరుణ్ కుమార్ జైన్, డి ఆర్ ఎం విజయ కుమార్, తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ సత్య నారాయణ, భాను ప్రకాష్ రెడ్డి, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు నుండి బయలుదేరి రేణిగుంట రైల్వే స్టేషన్ కు తిరుపతి జిల్లా లో రైల్వే శాఖ అభివృద్ధి పనులు పరిశీలించుటకు మరియు మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు ప్రయాణికులకు కల్పించే దిశగా చేపట్టాల్సిన అంశాలపై రైల్వే అధికారులతో రేపు తిరుమల శ్రీవారి దర్శనానంతరం చర్చించడం మరియు రైల్వే స్టేషన్ సందర్శన ఉంటాయని, తిరుపతి జిల్లా పర్యటన అనంతరం హైదరాబాద్ నందు రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం కమిటీ తిరుపతి తాజ్ హోటల్ కు బయల్దేరి వెళ్ళారు. నేటి రాత్రి తిరుపతి తాజ్ హోటల్ నందు బస చేసి రేపు ఉదయం నవంబర్4న ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వేస్ జీఎం గారితో తాజ్ హోటల్ నందు సమావేశమై ప్రజలకు రైల్వే స్టేషన్ల నందు మెరుగైన సదుపాయాల కల్పనపై చర్చించి, మధ్యాహ్నం 3 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుని రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై ఆన్ ది స్పాట్ విజిట్ చేసి సందర్శించి స్టేషన్ డైరెక్టర్ తదితర అధికారులతో సమీక్షించి రాత్రి 7.45 గంలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం కానున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి, రైల్వే అధికారులు, తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *