రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పేద వారీ సొంత ఇంటి సాకారం చేసే క్రమంలో స్టేజ్ కన్వర్షన్ తో పాటుగా, ఉపాథి హామీ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చే విధంగా క్షేత్ర స్థాయిలో విధులను నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం హౌసింగ్, ఉపాధి హామీ, పి జి ఆర్ ఎస్, ఖరీఫ్ ధాన్యం సేకరణ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి. శ్రీరామ చంద్ర మూర్తి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అందుకోసం నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాల్సి ఉంటుందన్నారు. రెండోవ దశ 100 రోజులు కార్యక్రమం లో భాగంగా 4875 ఇళ్ళ నిర్మాణం పూర్తి చెయ్యాల్సి ఉండగా 786 ఇళ్లను పూర్తి చేశారని, 1688 ఇళ్లు రూఫ్ లెవెల్ లో, 3187 రూఫ్ కంప్లీట్ స్థాయిలోను ఉన్నాయని తెలిపారు. వాటిని తదుపరి స్థాయి కి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 20,227 ఇళ్లకు 20225 మంజూరు చేయడం జరిగిందనీ తెలిపారు. 2019-2024 మధ్య మంజూరు చేసిన 1567 ఇళ్లలో 1287 పూర్తి కాగా, ఇంకా 284 పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు.
ఉపాధి హామీ పని దినాల లక్ష్యాలను నూరు శాతం సాధించాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదేశించారు. కొన్ని మండలాలు 120 శాతం సాధించగా, 70 నుంచి 80 శాతం మాత్రమే పూర్తి కావడం పై రంగంపేట, సీతానగరం, పెరవలి ఎంపిడిఓ లని వివరణ కోరడం జరిగింది. జిల్లాలో 100 రోజుల పని దినాల లక్ష్యాలను 2389 కుటుంబాల లక్ష్యం కాగా 100 శాతం పూర్తి చెయ్యడం జరిగిందని అన్నారు. అదే స్ఫూర్తితో మిగిలిన లక్ష్యాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం 173 చేపట్టాల్సి ఉండగా ఒకటి పూర్తి 65 పురోగతి లో ఉన్నట్లు, ఇంకా 107 ప్రారంభించాల్సి ఉందన్నారు. మంగళవారం నాటికి అన్నీ పనులు ప్రారంభించాలన్నారు.
పిజి ఆర్ ఎస్ కి చెందిన 641 ప్రాసెస్ లో అండగా 6 రాష్ట్ర స్థాయి సగటు లో పరిష్కారం చెయ్యడం జరుగలేదని తెలిపారు. అర్జీలు స్వీకరించిన 24 గంటల్లో వాటిని పరిశీలన చెయ్యాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 1227 ఎఫ్ టి వో ల కింద 8,636 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసినట్లు తెలిపారు. ఇందులో 1014 ఎఫ్ టి వో లకి 6,683 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ సొమ్ము ప్రాసెస్ చెయ్యగా 845 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.15 కోట్ల 37 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. రీ సర్వే, గ్రామ సభలు నిర్వహణ తదితర అంశాలపై జెసి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో టి ఆర్ వో టి శ్రీరామచంద్రమూర్తి, డిప్యూటీ కలెక్టర్/ జిల్లా హౌసింగ్ అధికారి కేఎల్ శివ జ్యోతి , డి ఏ ఓ ఎస్ మాధవ రావు, జిల్లా మేనేజర్ పౌర సరఫరాలు టీ రాధిక, డీఎస్ఓ కెవిఎస్ఎమ్ ప్రసాద్, డ్వామా పిడి ఏ. నాగమల్లేశ్వరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి త బి వి గిరి దితరులు పాల్గొన్నారు.