-జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పీజీఆర్ఎస్ ) లో వచ్చిన అర్జీలను ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు, డిఆర్ఓ టి. శ్రీరామ చంద్ర మూర్తి తో కలసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు ఏ ఒక్కటి పెండింగ్ లో ఉండకుండా నిర్ణీత సమయంలోనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీజిఆర్ఎస్ కు అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై స్వీకరించిన అర్జీలను ఎప్పటి కపుడు పరిశీలించి, సకాలంలో నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. సమస్యపై తీసుకున్న చర్యలతో అర్జీదారుడు సంతృప్తి చెందాలని, అర్జీ మరలా రీ ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండరాదన్నారు.
జిల్లాలో మొత్తం ప్రజల నుంచి పి జి ఆర్ ఎస్ లో 126 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ఇందులో ఆన్ లైన్ 125 ఆఫ్ లైన్ 1 ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రెవిన్యూ శాఖ కు 64, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కు 19, హోం శాఖకు 19, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ కు 9, వ్యవసాయం మరియు సహకారంకు 3, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లు కు 2, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాలు కు 2, సాంఘిక సంక్షేమం, జలవనరులుశాఖ, రవాణా, రోడ్లు మరియు భవనాలుశాఖ, పరిశ్రమలు మరియు వాణిజ్యం, విధ్యుత్ శాఖ,పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్ మరియు ఫిషరీస్, ప్లానింగ్ శాఖలకు ఒక్కొక్క అర్జీ చొప్పున వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఆర్ వో – టి. శ్రీరామ చంద్ర మూర్తి, సిపివొ అప్పలకొండ, డీఆర్డిఎ పిడి ఎన్ వివి ఎస్ మూర్తి ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.