Breaking News

రాబోయే ఐదేళ్ల‌లో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంద‌బోతుంది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఐ.టి.టి ల్యాబ్స్ ప్రారంభోత్స‌వానికి హాజ‌రు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కార్య‌ద‌క్ష‌త తో రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది సాధించ‌నుంది. అమరావ‌తి రాజ‌ధాని ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, ఆటో మొబైల్ ఇండ‌స్ట్రీ నుంచి టూరిజం వ‌ర‌కు అనేక ప‌రిశ్ర‌మ‌లు రాబోతున్నాయి. భ‌విష్య‌త్తులో చార్టెడ్ ఎకౌంటెట్స్ అవ‌స‌రం చాలా వుందని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. గ‌వ‌ర్న‌ర్ పేట లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ బ్రాంచ్ నందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ (ఐ.టి.టి ల్యాబ్స్) కంప్యూటర్ ల్యాబ్స్ ప్రారంభోత్స‌వ కార్య‌క్రమం సోమ‌వారం జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఐ.టి.టి ల్యాబ్స్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ట్యాక్స్ పేయ‌ర్స్ తో ప్ర‌భుత్వానికి ట్యాక్స్ చెల్లించే విధంగా బాధ్య‌త తీసుకున్న చార్టెడ్ ఎకౌంటెట్స్ స‌మాజానికి ఎంతో సేవ చేస్తున్నార‌ని కొనియాడారు. ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిపోయిన ఈ సంస్థ‌లోని స‌భ్యులు కూడా త్వ‌ర‌లో తిరిగి వ‌చ్చే ప‌రిస్థితులు రానున్నాయ‌న్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు పెద్ద పెద్ద ప‌రిశ్రమ‌లు ముందుకు రానున్న‌ట్లు తెలిపారు. రాబోయే కాలంలో చార్టెడ్ ఎకౌంటెట్స్ కి మంచి డిమాండ్ వుండనుంద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన ఒక కుటుంబంలో ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ నినాదం ల‌క్ష్యంగా చేసుకుని ఎన్టీఆర్ జిల్లాలో ఏడాది ప‌దివేల ఎమ్.ఎస్.ఎమ్.ఈ ల‌కు ప్రోత్సాహం అందిచాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపారు. ఎంట‌ర్ ప్రెన్యూర్ కావాల‌నుకునే వారిలో చాలా మంది నిర‌క్ష‌ర్యాసులు వారికి ఆన్ లైన్ లో అప్లికేష‌న్ పూర్తి చేయ‌టం రాదు. అలాంటి వారికి వాలంటరీగా స‌ర్వీస్ చేసేందుకు ఈ సంస్థ స‌హ‌కారం కావాల‌ని కోరారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌ను ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా త‌యారు చేసే విష‌యంలో అంద‌రం క‌లిసి క‌ట్టుగా కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ ఎమ్.ఎస్. బేగ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్, అర్బ‌న్ మైనార్టీ సెల్ మాజీ అధ్య‌క్షుడు ఎమ్.డి.ఇర్ఫాన్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ బ్రాంచ్ చైర్మ‌న్ సిఎ ఎన్.నెట్టా ర‌వికిషోర్, వైస్ ఛైర్మ‌న్ సిఎ కె.నారాయ‌ణ‌, మాజీ ఛైర్మ‌న్ అక్క‌య్య నాయుడు, మాజీ ఛైర్మ‌న్ సిఎ వి.న‌రేంద్ర‌బాబు, మాజీ చైర్మ‌న్ సిఎ జి.శ్రీనివాస‌రావు, మాజీ ఛైర్మ‌న్ సిఎ కె.పూర్ణ చంద్ర‌రావు, సెక్ర‌ట‌రీ సిఎ యు.జ‌యంత్, ఎస్.ఐ.సి.ఎ.ఎస్.ఎ చైర్మ‌న్ సిఎ వి.ప‌వ‌న్ కుమార్, సిఎ ప‌ర్వేజ్, పాల్గొన్నారు.

Check Also

సూర్య ఘర్ పధకం లక్ష్యం ప్రయోజనాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య ఘర్ పథకం ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకునేలా వారికి బ్యాంకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *