Breaking News

అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత నివ్వాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం లో వచ్చిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో సోమవారం మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కోర్టుదిక్కర కేసులలో జాప్యం చేయరాదని, వకాలత్ లు దాఖలు చేయడంలో జాప్యం చేయడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ అధికారులను మందలించారు.

మీకోసం అర్జీలలో…..

గుడివాడ బేతవోలుకు చెందిన దివ్యాంగ బాలిక కృష్ణశ్రీ, బందరు మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన దివ్యాంగ బాలిక తలుపుల అక్షర తమకు వికలాంగుల పెన్షన్ 6000 వస్తున్నాయని, లేవలేని స్థితిలో ఉన్న వీరికి ప్రభుత్వం పెంపు చేసిన 15వేల రూపాయల పింఛను మంజూరు చేయించాలని కోరుతూ వారి తల్లిదండ్రులు మీకోసం లో అర్జీలు సమర్పించగా, మెడికల్ వెరిఫికేషన్ చేయించి అర్హత మేరకు వీరికి పెంపు చేసిన పింఛన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో ప్రభుత్వం సేకరించిన భూములకు నష్టపరిహారం బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామస్తులు అర్జీలు సమర్పించారు.

జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ ఓ ఇంచార్జ్ శ్రీదేవి, బందర్ ఆర్డీవో కే స్వాతి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

డిఎం అండ్ డాక్టర్ జి గీతాబాయి, డీఎస్ఓ వి పార్వతి, డిపిఓ జె అరుణ, డిఎం సివిల్ సప్లై సృజన, డ్వామా పిడి శివప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *