– ఆర్డీఓ ఆర్ కృష్ణ నాయక్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ధవళేశ్వరం సాండ్ పాయింట్ వద్ద ఇసుకతో కూడి ఎటువంటి బిల్లుల లేని 3 లారీలను గుర్తుంచి వాటిని సీజ్ చెయ్యడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ తెలిపారు. మంగళవారం ఉదయం 10.20 సమయంలో ధవళేశ్వరం ఇసుక రిచ్ ల ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంలో ఇసుక లోడ్ తో ఉన్న మూడు లారీలను గమనించడం జరిగిందన్నారు. సదరు మూడు లారీల్లో ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా ఇసుక రవాణా చేయడం గమనించడం జరిగిందన్నారు. సదరు లారీ యాజమాన్యం పై విచారణ చేసి సదరు లారీలను సీజ్ చేయవలసినదిగా రాజమహేంద్రవరం సౌత్ డి ఎస్పీ వారికి సూచనలు జారీ చేసియున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కృష్ణ నాయక్ తెలిపారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక ఉచితంగా తీసుకొని వెళ్లవచ్చు అని, ఇందుకు సంబంధించి గ్రామ అధికారి ద్వారా పొందిన ధ్రువపత్రాలను అనుసరించి పొందాల్సి ఉంటుందన్నారు.