Breaking News

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత తో కూడిన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తోందని, జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్య సేవల సదుపాయాల కల్పనపై రుయా, స్విమ్స్, బర్డ్, మెటర్నటీ, అశ్విని ఆస్పత్రుల సూపరింటెండెంట్ లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తోoదని కావున అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్య సేవలు రోగులకు అందించాలని తెలిపారు. ప్రతిరోజు చికిత్స నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి ఆసుపత్రికి పేషెంట్లు రావడం జరుగుతుందని వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాల పైన వారికి అవగాహన కల్పించి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబల కుండా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.శ్రీహరి, డిసిహెచ్ఎస్ ఆనందమూర్తి, రుయా, స్విమ్స్, ఈఎస్ఐ, అరవింద్ ఐ హాస్పిటల్ , మెటర్నిటీ, టీటీడీ అశ్విని ఆస్పత్రుల సూపర్డెంట్లు డా. రవి ప్రభు, డా.రామ్, డా. శ్రీధర్, డా. అశోకవర్ధన్, డా. పార్థసారథి, డా. కుసుమ కుమారి, డిఐఓ డా. శాంతకుమారి, జిల్లా మలేరియా అధికారి డా. రూప్ కుమార్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కోఆర్డినేటర్ రాజశేఖర్, జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మేనేజర్ శివకుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *