Breaking News

ఇళ్ల లేఅవుల్లో మౌలిక సదుపాయల పనులు జూలై నెలఖారునాటికి పూర్తి చేయండి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పేదలకోసం చేపట్టిన గృహనిర్మాణాలు లేఅవుట్ ల్లో మౌలిక వసతులు సదుపాయల పనులను జూలై నెలఖారునాటికి నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నీవాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇళ్ల లేఅవుట్లల్లో మౌలిక సదుపాయల కల్పన పురోగతిపై గృహనిర్మాణం ఆర్‌డబ్ల్యుఎస్ విద్యుత్ తదితర శాఖ అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ జె.నివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఇళ్ల లేఅవుట్లో మౌలిక సదుపాయల కల్పన పనులు జూలై నెలఖారునాటికి పూర్తి చేయాలని  ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలకు అనుగుణంగా పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 1020 లేఅవుట్లు గాను 863 లేఅవుల్లో నీటి బోరులు వేసే పనులు ప్రారంభం కాగా మరో 59 పనులు బుధవారం ప్రారంభమవుతాయన్నారు. వివిధ కారణాలతో మిగిలిన 98 లేఅవుల్లో పనులను చేపట్టేందుకు అవసరమైన పరిష్కార పనులు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 289 బోర్లకు విద్యుత్ సదుపాయం కల్పించారని మరో 205 బోర్లకు సంబంధించి లేఅవుట్, మండల వారిగా జాబితాను ట్రాన్స్ కో ఎస్సీకి అందజేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా లేఖవుల్లో నీళ్ల ట్యాంకుల ఏర్పాటు పనులు కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిగేందుకు అవసరమైన ఇసుక, సిమ్మెంట్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వియంసి లేఅవుట్ల అభివృద్ధి మౌలిక సదుపాయల పనుల పురోగతిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం టిడ్కో ఇళ్ల అంశంపై కూడా సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీనివాస్ నుపూర్ అజయ్ కుమార్, హౌసింగ్ పిడి రామచంద్రన్, డిఆర్‌డిఎపిడి శ్రీనివాసరావు, ఎపిఈపిడిసిఎల్ ఎస్ఇ శివప్రసాద్ రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఫ్లే సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *