అంబేద్కర్ స్మృతి వనం పనుల కోసం తక్షణమే కార్యాలయాలను ఖాళీ చేయండి … : కలెక్టరు జె.నివాస్..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనుల కోసం స్వరాజ్యమైదానంలో ఉన్న కార్యాలయ భవనాలను వారం రోజుల్లో ఖాళీ చేయాలని జిల్లా కలెక్టరు జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణపనులపై మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరు జె. నివాస్ విజయవాడ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతివనం నిర్మాణపనులను కాంట్రాక్టరుకు అప్పగించిన 14 నెలల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మైదానంలో ఉన్న భవనాలను తక్షణమే తొలగించాలన్నారు. ఇప్పటికే పాలిటెక్నికల్ భవనాన్ని ఖాళీ చేయించామని ఆయన చెప్పారు. జలవనరుల శాఖకు చెందిన రి భవనాలను ఖాళీ చేయించి ఆభవనాలను కూడా తొలగించామన్నారు. మరో 5 భవనాలను ఖాళీ చేయించామని వాటికి ప్రస్తుతం విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయని వాటికి విద్యుత్తును నిలిపివేయాలని సంబంధిత శాఖాధికారులను కలెక్టరు ఆదేశించారు. మిగిలిన కార్యాలయ భవనాలను వారం రోజుల్లో ఖాళీ చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశిస్తూ ఇతర కార్యాలయాలను కూడా తరలించే బాధ్యత కూడా అప్పగించారు. ఇన్ ల్యాండ్ వాటర్ వేవ్స్ అథారిటీ కార్యాలయానికి గతంలో జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ పొసైటీ భవనంలో సుమారు 2 వేల చదరపు అడుగులకు పైగా కేటాయించామని సంబంధిత అధికారులు కోరిన విధంగా మరో 1000 చదరపు అడుగులను కేటాయిస్తామన్నారు. వెంటనే ఆకార్యాలయాన్ని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఏర్పాటుకు స్టేట్ గెస్ట్ హౌస్ ఆవరణలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆధీనంలో ఉన్న సమావేశ మందిరాన్ని కేటాయించామన్నారు. వెంటనే సమాచార శాఖ కార్యాలయాన్ని తరలించమని ఆదేశించారు. జిల్లా కోఆర్డినేటర్ వెంటనే సమావేశమందిరాన్ని సమాచారశాఖకు అప్పగించాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. స్వరాజ్య మైదానంలో ఉన్న రైతుబజారుకు సంబంధించి రైతులకు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా గాంధీనగర్ ధర్నాచౌక్ సమీపంలో నిర్మిస్తున్న రైతుబజార్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సమీపంలో కాల్వగట్టుపై మరో రైతు బజార్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులకు జిల్లా కలెక్టరు సూచించారు. స్మృతివనం ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని నిర్మాణపనులను వేగవంతం చేసి సకాలంలో పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టరు ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు డా. కె. మాధవిలత, మున్సిపల్ కమిషనరు ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు ఏ.మురళీకృష్ణా రెడ్డి, ఏపిఐఐసి జోనల్ మేనేజరు ఏ.పాంబశివరావు, డిప్యూటి జోనల్ మేనేజరు ఏ.కిశోర్, సోషల్ వెల్ఫేర్ డి. 8. సరస్వతి, మార్కెటింగ్ శాఖ డిప్యూటి డైరెక్టరు యం. దివాకరరావు, సమాచార శాఖ డిప్యూటి డైరెక్టరు యప్. మహబూబ్ భాషా, ఇ ల్యాండ్ వాటర్ వేస్ అధికారి పి.ప్రదీప్ కుమార్, వియంసి ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు వి.శ్రీనివాస్, అసిస్టెంట్ పిటి ప్లానర్ వి.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *