Breaking News

DBT ద్వారా బ్యాంకు నందు పెన్షన్ మొత్తం జమ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వికలాంగుల పెన్షన్ పొందే విద్యార్ధులు, దూర ప్రాంతంలో విద్యను అభ్యసిస్తున్నట్లు అయితే వారికి DBT ద్వారా బ్యాంకు నందు పెన్షన్ మొత్తం జమ చేయుటకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగినది. పై విషయం లో ఈ క్రింది ధృవీకరణ ప్రతం లు పంపవలసి ఉంటుంది.
1) సంభందిత MPDO/MC వారు ధృవీకరిస్తూ PD,DRDA వారికి పెన్షన్ బ్యాంకు వివరములతో లేఖ.
2) Study Certificate
3) బ్యాంకు పాస్ బుక్ వివరములు (మొదటి పేజి బ్యాంకు ఖాతా నెం మరియు బ్యాంకు వివరములు కనపడే విధముగా)
కావున మీ పరిధిలో దూర ప్రాంతంలో చదువుచున్న వికలాంగులు అయిన విద్యార్ధులు ఉన్నట్లు అయితే వారు DBT విధానం కోరినట్లు అయితే జాగ్రతగా పరిశీలించి ప్రతి పాదనలు DRDA కార్యాలయం నకు పంపవలసినదిగా MPDO/MC లను కోరడం అయినది.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *