గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిఎంసి కార్మికులు సమస్యల పరిష్కారానికి ప్రతి నెల రెండో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు తమ సమస్యల పై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ప్రతి నెల రెండో గురువారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు తెలిపారు. గురువారం కమిషనర్ చాంబర్ లో కార్మికుల సమస్యల పరిష్కారం పై లీడ్ బ్యాంక్ మేనేజర్, విఎస్పిఎన్ ఏజన్సీ, వివిధ కార్మిక సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల వారీగా కార్మికుల సమస్యల పరిష్కారంకు ప్రతి నెల రెండో గురువారం వర్కర్స్ గ్రీవెన్స్ నిర్వహించనున్నామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో కార్మికులు ప్రధానంగా పిఎఫ్, ఈఎస్ఐ, రుణాలు, ఆప్కాస్ తదితర అంశాలపై ఎదురవుతున్న సమస్యలను తమ దృష్టికి తెస్తున్నారన్నారు. సదరు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. వార్డ్ సచివాలయాల వారిగా ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు తమ పరిధిలోని కార్మికులకు ఉన్న పిఎఫ్ సమస్యల పై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు వివిధ సమస్యలపై అందించిన ఆర్జీలను తీసుకున్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిపాల్ రెడ్డి, విఎస్పిఎన్ ఏజన్సీ నుండి నాగేశ్వరరావు, వివిధ కార్మిక సంఘాల నుండి మాల్యాద్రి, మధుబాబు, శంకర్రావు, రవి కుమార్, ముత్యాలరావు, కమల్ పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …