Breaking News

నో మాస్క్ నో రైడ్ సహకరించండి…

-మాస్క్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు కౌన్సిలింగ్
-ఆర్టీఓ కె రామ్ ప్రసాద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోన పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మన కొద్దిపాటి నిర్లక్ష్యం తిరిగి కరోన వ్యాప్తికి కారణం కాకూడదని ఆర్టీఓ కె రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాస్క్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా స్థానిక బందర్ రోడ్డు లోని ఆర్&బి కార్యాలయం ముందు ఆర్టీఏ అధికారులు నో మాస్క్ నో రైడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కె రామ్ ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని దానితో పాటు వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న కూడా మాస్క్ ధరించకుండా రోడ్లపైకి వస్తే కరోన బారిన పడే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. మన కుటుంబంతో పాటు, సమాజం శ్రేయస్సు దృశ్య మాస్కులు ధరించడం తప్పనిసరి అన్నారు. ప్రజల్లో కోవిడ్ పై మరింత అవగాహన కలిగించేందుకు డిటీసీ యం పురేంద్ర ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు, వాహన చోదకులకు, ప్రయాణికులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. వ్యక్తిగత వాహనాలు నడిపేవారు వారితో పాటు ప్రయాణించే వారు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందేనన్నారు. ముఖ్యంగా ఆటోడ్రైవర్లు పూర్తి స్థాయిలో మాస్కులు వినియోగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఘటనలు చూస్తున్నామని రామ్ ప్రసాద్ తెలిపారు. ప్రయాణికులను చేరవేసే బస్సులు,ఆటోలు, క్యాబ్ లు నడిపే డ్రైవర్లు మాస్కులు ధరించడమే కాకుండా వాహనాలలో ఎక్కే ప్రయాణికులు కూడా మాస్కులు దరించేలా చూడాలన్నారు, అలా ధరిస్తేనే వాహనంలోకి అనుమతించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోన నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కరపత్రాలను రూపొందించడం జరిగిందన్నారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా బస్సులలో ఆటోలలో క్యాబ్ లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కరపత్రాలను అందజేశారు. ఆటోల వెనుక భాగంలో పోస్టర్ లను అతికించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఎ విజయసారధి, మోటార్ వాహన తనిఖీ అధికారులు డి ఎస్ ఎస్ నాయక్, రాధిక దేవి, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు, కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *