Breaking News

డిజిపి గౌతం సవాంగ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మహిళా పోలీసులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పోలిస్ ప్రధాన కార్యాలయం లో డిజిపి గౌతం సవాంగ్ ఐపీఎస్ ను మహిళా పోలీసులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ లో మహిళల భద్రత , రక్షణకు పెద్దపీట  వేస్తూ అనుక్షణం వారికి తోడు నీడగా అన్నివేళలా అందుబాటులో ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్. జగన్ మోహన్ రెడ్డి  గ్రామ, వార్డు సచివాలయల్లోని 15000 మంది  మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ  జీవో నెంబర్ 59ని జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళా పోలీసులు ముఖ్యమంత్రి కి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  గౌతం సవాంగ్ ఐపీఎస్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్భంగా మహిళా పోలీసులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తాము  పోలీసు శాఖలో అంతర్భాగంగా  రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీస్ శాఖ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ సర్వీసెస్ డిఐజి జి.పాలరాజు ఐపీఎస్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *