Breaking News

అర్జీల స‌త్వ‌ర ప‌రిష్కారానికి కృషిచేయండి

– జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మానికి 123 అర్జీలు.
– జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా.

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా అందుతున్న ప్ర‌తి అర్జీని క్షుణ్నంగా ప‌రిశీలించి, స‌త్వ‌ర ప‌రిష్కారానికి అధికారులు కృషిచేయాల‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య‌క్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా.. డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీ న‌ర‌సింహంతో క‌లిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా నిధి మీనా మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చి అందించిన అర్జీల‌పై అధికారులు ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మంలో మొత్తం 123 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూ-48, పోలీస్‌-19, ఎంఏయూడీ-13, వైద్యఆరోగ్యం-5, మార్కెటింగ్‌-5, విద్య‌-5, పంచాయ‌తీరాజ్‌-4, గృహ‌నిర్మాణం-3, ఉపాధిక‌ల్ప‌న‌-3, పౌర స‌ర‌ఫ‌రాలు-2, ఆర్ అండ్ బీ-2, డీఆర్‌డీఏ-2, మైన్స్ అండ్ జియాల‌జీ-2, ఏపీసీపీడీసీఎల్, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్‌, ఎస్‌సీ కార్పొరేష‌న్‌, మైనారిటీ సంక్షేమం, స‌హ‌కార‌, స‌ర్వే, వ్య‌వ‌సాయం, దేవాదాయ‌, సాంఘిక సంక్షేమం, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల‌కు సంబంధించి ఒక్కో అర్జీ అందింది. కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

విఎంసి సిబ్బందికు సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు శిక్షణ కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *