Breaking News

సచివాలయ కార్యదర్శులు స్థానికంగా ఉండే ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సచివాలయ కార్యదర్శులు స్థానికంగా ఉండే ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, నూతన రోడ్లు, డ్రైన్ నిర్మాణ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజల నుండి పిజిఆర్ఎస్ లో అందే ఫిర్యాదులు లేదా ఆర్జీలను నేరుగా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ వార్డ్ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్  రత్నగిరి నగర్, తురకపాలెం రోడ్, నగరాలులోని సరస్వతి నగర్ తదితర ప్రాంతాల్లో స్థానికుల ఫిర్యాదు మేరకు జిఎంసి అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా స్థానిక సమస్యల పరిష్కారానికి ఆయా కార్యదర్శులు భాద్యత తీసుకోవాలన్నారు. పారిశుధ్యం, నీటి సరఫరా, పైప్ లైన్ మైనర్ లీకులు, ఇంటి పన్నులు, రహదారుల ఆక్రమణలు, వీధి దీపాలు వంటి సమస్యలను సచివాలయం పరిధిలోనే పరిష్కారానికి కృషి చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రత్నగిరినగర్ లో పర్యటించి, త్రాగునీరు సక్రమంగా రావడంలేదన్న స్థానికుల ఫిర్యాదు మేరకు పెద్ద పలకలూరు రోడ్ లో అదనంగా బోర్ లు ఏర్పాటు చేసి, నీటిని అందించడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను, ఖాళీ స్థలాలో పెరిగిన మొక్కలను తొలగించుకోవాలని స్థల యజమానులను నోతీసులు ఇవ్వాలని శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. ప్యాచ్ వర్క్ లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. తురకపాలెం రోడ్ లో పర్యటించి, స్థానిక వార్డ్ సచివాలయంలో నూతన ట్యాప్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్థానికులకు తెలిపి, సదరు రోడ్ పక్కనవేసిన వ్యర్ధాలను తొలగించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. నగరాల్లోని సరస్వతి నగర్ లో యుజిడి ఓవర్ ఫ్లో ఫిర్యాదుని పరిశీలించి, యుజిడికి అనధికారికంగా కనెక్షన్ చేసిన వారిని గుర్తించి తక్షణం కనెక్షన్ తొలగించాలన్నారు. త్రాగునీటి సరఫరా సమయంపై స్థానికుల ఫిర్యాదు మేరకు ప్రతి 3 నెలలకు ఒక సారి సరఫరా సమయం మార్చాలన్నారు. ఆయా ప్రాంతంలో మురుగునీరు పారుదలకు వీలుగా కచ్చా డ్రైన్ నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏఈని ఆదేశించారు.
పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డిఈఈలు రమేష్ బాబు, శ్రీనివాస్, డిసిపి సూరజ్ కుమార్, ఏఎంహెచ్ఓ ఆనందకుమార్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *