Breaking News

ఆటోనగర్‌లో సుభాని బిర్యానీ హోటల్‌ ప్రారంభం


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటోనగర్‌లో సుభాని బిర్యానీ హోటల్‌ కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన బిర్యానీలను నగరవాసులకు అందిస్తున్నారని శాసనసభ్యులు గద్దె రామమోహన్‌, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ అనురాధ తెలిపారు. గురువారం ఆటోనగర్‌ 100 అడుగుల రోడ్డులో శాసనసభ్యులు గద్దె రామమోహన్‌, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ అనురాధ సుభాని బిర్యానీ హోటల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరవాసులకు సరిక్రొత్త రుచులుతో గుంటూరు సుభాని బిర్యాని హోటల్‌ను ప్రారంభించారని తెలిపారు. ఈ బిర్యానీ సెంటర్‌ దినాభివృద్ధి చెందుతూ నగరంలో మరిన్ని గుంటూరు సుభాని బిర్యాని హోటల్‌ సెంటర్‌లు ప్రారంభించాలని ఆకాక్షించారు. గుంటూరు సుభాని బిర్యాని హోటల్‌ దోనెపూడి నాగదీష్‌ మాట్లాడుతూ విజయవాడ నగర వాసులకు బిర్యాని రుచులను అందించాలనే ఉద్దేశంతో ఆటోనగర్‌ నందు హోటల్‌ ప్రారంభించినట్లు తెలిపారు. బిర్యానీలలో అన్ని రకాల రుచులను అందించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మటన్‌ బిర్యానీ, చికెన్‌ బిర్యానీ, కిచిడి, పాయా, మటన్‌ కబాబ్‌, పూర్తి స్వచ్ఛమైన నెయ్యితో వంటకాలను తయారుచేస్తామని తెలిపారు. సుమారు 16 సంవత్సరాల అనుభవం కల చెఫ్‌లతో బిర్యానీ వంటకాలను తయారుచేస్తామనీ తెలిపారు. నగర వాసులకు హోమ్‌ పార్సిల్‌ వెసులుబాటును కల్పిస్తున్నామని తెలిపారు. అన్ని రకాలైన ఫంక్షన్లుకు ఆర్డర్లు పై తయారుచేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. చెఫ్‌ ఇస్మాయిల్‌ మాట్లాడుతూ నగరవాసులకు సరిక్రొత్త రుచులుతో అనేక రకాల బిర్యానీలను అందిస్తున్నామన్నారు. అతి తక్కువ ధరలతో నగరవాసులకు పసందైన అనేక రకాల బిర్యానీలను అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *