Breaking News

భూ సంబంధిత అర్జీలు పరిష్కారంతో గ్రామంలో చాలా వరకు సమస్యలు తీరుతాయి

-డిసెంబర్ చివరి నాటికి వంద శాతం పీజీఆర్ఎస్ రెవెన్యూ సంబంధిత అర్జీల పరిష్కారం కావాలి
-ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలలో ఎలాంటి అలసత్వం, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అందించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ శాఖ ప్రజలతో అనుబంధమైన ముఖ్యమైన శాఖ అని ప్రజలకు సేవలు ఎలాంటి అలసత్వం లేకుండా అందించాలని, ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయని వాటిని పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సకాలంలో పరిష్కరించ గలిగితే చాలా వరకు గ్రామాలలో సమస్యలు తగ్గిపోతాయని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్  సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి రీ సర్వే, రెవెన్యూ అంశాలపై ఒక రోజు రెవెన్యూ అధికారుల సదస్సును ఉదయం, మధ్యాహ్నం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకుంటున్నామని, ఇకపై రెండు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని తద్వారా పలు భూ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మన తిరుపతి జిల్లాలో భూ సమస్యలపై పలు ఫిర్యాదులు ప్రత్యక్షంగా, పలు అర్జీలు పీజీఆర్ఎస్ నందు అందుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. పలు రెవెన్యూ సంబంధిత కేసులు కోర్టులో పెండింగ్ ఉండి, కలెక్టర్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటోందని, ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా కోర్టు ఉత్తర్వుల మేరకు సమీక్షించుకుని అమలు చేయడమా, అప్పీల్ వెళ్ళడమా అనేది సకాలంలో నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. ఒక డ్రైవ్ మోడ్ లో డిసెంబర్ చివరి నాటికి వంద శాతం అర్జీల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. వాటిలో జెసి క్రాస్ చెక్ చేయాలని సూచించారు. బియాండ్ ఎస్ఎల్ఎ కి అర్జీలు వెళ్లకుండా చూడాలని అన్నారు. డీమ్డ్ కన్వర్షన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, నిబంధనలు మార్గదర్శకాలు అనుసరించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. భూముల సర్వే సక్రమంగా చేపట్టాలని, సదరు సర్వే రిపోర్ట్ అర్జీదారునికి తప్పక ఇవ్వాలి అని తెలిపారు. 22 ఎ పెండింగ్ ప్రతిపాదనలు ఉంటే వాటిని వాస్తవ విషయాలతో పంపాలని సూచించారు. జిల్లాలో పలు పరిశ్రమలు, జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు భూ సేకరణ అంశాలు పలు ప్రాజెక్టులకు ప్రాధాన్యత గా చేపడుతున్నామని, ఈ అంశంలో జెసి, అధికారులు బాగా పని చేస్తున్నారని, మరింత వేగవంతంగా అధికారులు చేపట్టాలని అన్నారు.

రీ సర్వే సమస్యలపై వాటి పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహించి గతంలో చేపట్టిన భూముల రీసర్వే లో సమస్యల పరిష్కారానికి అందిన అర్జీలు పరిష్కారానికి త్వరిత గతిన చర్యలు తీసుకుని పూర్తి చేయాలని సూచించారు. భూముల మ్యూటేషన్, భూ ఆక్రమణల అంశంలో జాగ్రత్తగా ఖచ్చితంగా నిబంధనల మేరకు చేయాలని, పొరపాట్లు దొర్లితే అధికారులే బాధ్యులు అవుతారని అన్నారు. భూ తగాదాలు పరిష్కారం కాక పోతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఉచిత ఇసుక విధానంలో గ్రామంలో అందుబాటులో ఉండే ఇసుకను ఎడ్ల బండి, ట్రాక్టర్లలో తమ ఇంటి నిర్మాణాలకు తీసుకెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. అలాగే ప్రభుత్వ ప్రాజెక్టులకు ఇసుక అందుబాటుకు ఇబ్బంది పెట్టరాదని అన్నారు. క్రమ శిక్షణ ఎంక్వైరీ నివేదికలు త్వరితగతిన పంపాలని, వాటి డిస్పోజల్ సక్రమంగా చేయాలని సూచించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ లపై పూర్తిగా అన్ని అంశాలపై ఆధార పడి తాసిల్దార్లు పని చేయరాదని, అప్రమత్తతో పనిచేయాలని తెలిపారు. ఫైళ్లు, రికార్డులు సక్రమంగా భద్ర పరచాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న తాసిల్దార్ కార్యాలయాలు అందుబాటులోని ఎంపిడిఓ తదితర భవనాలలోకి చేరాలని లేదా రికార్డులు భద్ర పరచాలని తెలిపారు. అందరూ అధికారులు కలిసి సమన్వయంతో బాగా పని చేసి జిల్లా అగ్ర స్థానంలో నిలిచేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టరేట్ పరిపాలన అంశాలు పూర్తి స్థాయిలో చేపట్టాలని సూచించారు. పెండింగ్ ఆడిట్ ప్యారాలపై త్వరిత గతిన వారం లోపు నివేదికలు క్షేత్ర స్థాయి నుండి పంపాలని ఆదేశించారు.

జెసి మాట్లాడుతూ పీజిఆర్ఎస్ ఫిర్యాదుల పై టెలీకాన్ఫరెన్స్ విసిల నిర్వహణ చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఆర్జీలు నాణ్యతగా పరిష్కారం ఉండాలని సూచించారు. రీ సర్వే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టైం లైన్ మేరకు ఓఆర్ఐ, గ్రౌండ్ ట్రూతింగ్, వ్యాలిడేషన్ తదితరాలు అన్నీ చేపట్టాలని తెలిపారు. ప్లాంటేషన్ చేసిన రాళ్లపై గత ప్రభుత్వ హయాంలోని రాతలను చెరిపి వేసేందుకు డిసెంబర్ 20 నాటి వరకు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఏదైనా భూ విస్తీర్ణ సమస్యలు ఉంటే వాటికి సంబంధించి భూ సంబంధిత యజమాని ఎల్పిఎం విస్తీర్ణం క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆర్బిట్రేషన్ చేపట్టి సెక్షన్ 24 ఆఫ్ ఎస్ అండ్ బి యాక్ట్ మరియు సంబంధిత సర్క్యులర్ మేరకు సబ్ డివిజన్ చేయాలని సూచించారు. జాయింట్ ఎల్పీఎం ల విభజనను డాక్యుమెంట్ ఆధారంగా చేపట్టాలని, ఎల్పీఎం హద్దులు సవరణలు భూ నక్ష మాడ్యూల్ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి సవరణ అయినా నిబంధనలు పక్కాగా పాటించాలని ఎలాంటి అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే చర్యలు తప్పక ఉంటాయని అన్నారు.

రీ సర్వే కి సంబంధించిన రెవెన్యూ అంశాలు పేరు సవరణపై మ్యుటేషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని, స్ప్లిట్ ఎల్పిఎం భూ నక్షా నందు పొందు పరచాల్సి ఉంటుందని తెలిపారు. భూ ఖాతాల సూమోటో సవరణలు, తదితర అంశాలపై మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు చాలా సంవత్సరాలు గా భూమిపై ఉంటూ ఎంజాయ్మెంట్ లో ఉండి ఎలాంటి డాక్యుమెంట్ లేని పక్షంలో వాటికి సాదా బైనామా నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.

సమావేశ అనంతరం పలు ఆర్డీఓ లు, తాసిల్దార్ల సమస్యలపై కలెక్టర్ సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సమీక్షలో సబ్ కలెక్టర్ గూడూరు రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి నర్సింహులు, ఆర్డీవోలు శ్రీకాళహస్తి సూళ్లూరుపేట భాను ప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, జిల్లా సర్వే అధికారి అరుణ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారిణి భారతి, వివిధ సెక్షన్ సూపరింటెండెంట్లు, అన్ని మండలాల తాసిల్దారులు సంబంధిత సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *