-సమిష్ఠ కృషితో విజయవాడ ను అభివృద్ధి పరుద్దాం-ఎం ఎల్ ఎ సుజన చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానాని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ( చిన్ని), పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) విజయవాడ నగర అభివృద్ధికై కమిషనర్ ధ్యానచంద్ర, శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని నుండి నిధులను సమకూర్చే దిశగా ఈ సమావేశం సమీక్షించారు. అందులో భాగంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బి ఆర్ టి ఎస్ రోడ్ నుండి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళుటకు కావాల్సిన ప్రణాళిక, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సింగ్ నగర్, రాజరాజేశ్వరి పేట నుండి ఎర్రకట్టు వెళ్ళుటకు బ్రిడ్జిలు నిర్మించే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రధాన ప్రాంతాలు, శివారు, కొండ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్పొరేషన్ కు ఆదాయం తెచ్చే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. రాబడి పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజయవాడ ను స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. విజయవాడలను క్రీడలు క్రీడలను ప్రోత్సహించేందుకు స్టేడియంలను అభివృద్ధి పరచడం ఎంతో అవసరం అన్నారు.
ఎంఎల్ఎ సుజన చౌదరి మాట్లాడుతూ విజయవాడ నగర అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించడంతోపాటు రోడ్లు, రైల్వే బ్రిడ్జిలు,శానిటేషన్, స్మార్ట్ టాయిలెట్లు ,స్ట్రామ్ వాటర్ డ్రైయిన్ల ఏర్పాటు తో పాటు ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్ వంటి పలు సుందరీ కరణ కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజలకు మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని అన్నారు. ప్రజల సమస్య తీర్చేందుకు వివిధ శాఖల మధ్యలో సమన్వయం ఎంతో అవసరం అని అన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగర అభివృద్ధికి అధికారులందరూ సమిష్టో కృషితో పని చేస్తున్నారని, నగరంలో నగరపాలక సంస్థ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వివిధ శాఖలు వారందరూ చేపడుతున్నారని, ప్రజలు కూడా ఖాళీ స్థల, ఆస్తి, వివిధ పన్నులు సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, సూపరిండెంటింగ్ ఇంజనీర్ పి సత్యకుమారి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డాక్టర్ లత, ఎకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.