-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజం లోని ప్రతి ఒక్కరరూ టి.బి వ్యాధి నివారణకు కృషి చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు ఎన్ హెచ్ ఎం మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టి.బి కార్యాలయం మరియు టాటా ఇన్స్టిట్యూషన్ అఫ్ సోషల్ సైన్స్ సంయుక్తంగా రాష్ట్రం లోని లెప్రసి,ఎయిడ్స్,టి.బి. నివారణ అధికారులకు హాయ్ ల్యాండ్ లో రెండు రోజుల కార్యశాల(workshop) ను ఆమె ప్రారంభించారు. ప్రారంభోత్సవ ఉపన్యాసం లో ఆమె మాట్లాడుతూ టి.బి. నివారించగలిగే వ్యాధి అని అన్నారు. ప్రతి ఒక్క అధికారి తమ జిల్లా కు సంబదించి ప్రత్యేక ప్రణాళికల్ని తయారు చేసుకోవాలన్నారు. ఇంతకు ముందు టి.బి తో బాధపడి బయటపడిన టి.బి. ఛాంపియన్లకు శిక్షణిచ్చి వారి సేవల్ని ఉపయోగిచుకోవాలన్నారుఅలాగే రోగి పూర్తికాలం మందులు వాడాలంటే కౌన్సిలింగ్ చాలా అవసరమన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో టి.బి. వ్యాధి నిర్ధారణకు ముందస్తుగానే ట్రునాట్ , మరియు సిబినాట్ మెషిన్లను 780 ల్యాబ్ లలో ఏర్పాటు చేశామని, ఇది చాలా మంచి పరిణామం అని అన్నారు. రాష్ట్ర క్షయ నివారణ అదికారి డాక్టర్ టి. రమేష్ మాట్లాడుతూ అన్ని జిల్లాలోని టి.బి.అనుమానితులను గుర్తించి పరీక్షలను జరిపి పూర్తి కాలం మందుల్ని అందించి క్షయ నివారణకు కృషి చేయాలన్నారు.