తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల హక్కుల వారోత్సవాల ముగింపు దినోత్సవం పురస్కరించుకొని మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు రాస్ సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి మండలంలో మంగళం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు దినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగినది .మహిళాభివృద్ధి మరియు జిల్లా బాలల రక్షణ అధికారి శివ శంకర్ గారు మాట్లాడుతూ నేటి బాలలే నేటి పౌరులు అనే నినాదంతో ప్రతి విద్యార్థి సామాజిక విషయాల పట్ల అవగాహణ పెంచుకుని స్వీయ రక్షణ పద్ధతులు పాటించాలని,, ఏదైనా సమస్యలు ఎదురైనపుడు కుటుంబం, పాఠశాల సిబ్బంది, స్వచ్చంధ సంస్థల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు.బాల్య వివాహం, బాల కార్మికులు వ్యవస్థ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుపతి ICDS సూపర్ వైజర్ శ్రీదేవి గారు మాట్లాడుతూ పిల్లలు మొబైల్ వ్యసనానికి దూరంగా ఉండాలని అవసరం మేరకే మొబైల్ ఉపయోగించాలని తెలియపరిచారు ప్రతి బాలిక బాగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిగమించాలని కోరారు.
రాస్ ప్రాజెక్టు ఆఫీసరు గారు మాట్లాడుతు ప్రతి విద్యార్థి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఆపద సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ 10 9 8 ఫోన్ చేస్తే సంబంధిత శాఖలు బాధ్యత వహించి పిల్లలను బాలల సంక్షేమ శాఖ నందు హాజరుపరిచి వారి రక్షణ మరియు సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలియపరిచారు. ఈ కార్య క్రమంలో మిషన్ వాత్సల్య సిబ్బంది దేవయాని, కల్పన,ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి గారూ రాస్ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు.పిల్లలు మరియు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది