అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్‌లో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి ఆదేశానుసారం క్షేత్రస్థాయిలో అధికారులకు విపత్తుల్లో అమలు చేయాల్సిన ప్రణాళికలు- విధివిధానాలపై అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ సన్నద్ధమైందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే రాష్ట్రస్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయిలోని అధికారుల వరకు విపత్తుల నిర్వహణలో సామర్ధ్యాల పెంపుదలకు శిక్షణా కార్యక్రమాలు రూపొందించేందుకు లైన్ డిపార్టమెంట్ అధికారులతో ఎండి రోణంకి కూర్మనాథ్ బుధవారం సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల్లోని ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్ విపత్తులకు ముందు సంసిద్ధత, విపత్తుల సమయంలో, విపత్తుల తరువాత పరిస్థితులపై ట్రైనింగ్ మాడ్యూల్స్ తో సాంకేతికత వినియోగం, ఇతర విశ్లేషించాల్సిన అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఎండి రోణంకి కూర్మనాథ్ సూచించారు. ప్రభుత్వ శాఖల్లో క్షేత్రస్థాయి వరకు సిబ్బందిని మరింత పటిష్టం చేసేందుకు డిసెంబర్ మొదటివారం నుంచి విపత్తుల నిర్వహణపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఐజి (ఏపిఎస్పీ 3వ రేంజ్) సీతారామ్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ వెంకటరమణ, ఎస్డీఎంఏ ఈడి నాగరాజు,ఎవో తిరుమల కుమార్, కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్ తనూజ, ప్రాజెక్టు మేనేజర్ బస్వంత్ రెడ్డి, ఇతర శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …