విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో బిఎస్‌పి గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభమైంది. స్థానిక జైహింద్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 22, 23 గవర్నర్‌పేటలో బిఎస్‌పి గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ బుధవారం నిర్వాహకులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు పి.దీపక్‌కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా వద్ద ప్రారంభోత్సవ ఆఫర్‌గా ఎన్ని గ్రాములు బంగారం కొంటే అన్ని గ్రాములు వెండి ఉచితం. ఈరోజు నుండి 10 రోజులు వరకు మా షోరూంనందు ఇస్తామని తెలిపారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, మరియు సంక్రాంతి పండగల సందర్భంగా కస్టమర్ దేవుళ్లకు ముందుగా నూతన ప్రారంభోత్సవ ఆహ్వానం పలికారు. మాకు 40 సంవత్సరముల నుండి ఈ వ్యాపారంలో అనుభవం ఉందని, బిఎస్‌పి గోల్డ్, డైమండ్స్, హోల్‌సేల్ అండ్ రిటైల్‌గా కూడా సప్లయ్ ఇస్తామని, మైలవరం, కంచికచర్లలో కూడా జ్యూవెలరీ షోరూంలు ఉన్నాయని, గోల్డ్ అండ్ డైమండ్స్, సిల్వర్‌లో పూర్తి అనుభవం వుందన్నారు. అతి తక్కువ ధరలతో ఆర్నమెంట్స్ కొత్త కొత్త డిజైన్లతో మీరిచ్చిన ఆర్డర్స్ ప్రకారం సకాలంలో అందివ్వగలమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు ఇందుపూరి శ్రీరామ్, దొడ్డాజయ నరసింహారావు, గూడవల్లి జయప్రకాష్, షోరూం సిబ్బంది భారీ సంఖ్యలో కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. .
Tags vijayawada
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …