విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో విద్య, వ్యవసాయం, పాడిపరిశ్రమ రంగ అభివృద్ధిలో కాకాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర ఉద్యమ సారథి, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా బుదవారం బెంజిసర్కిల్‌లో ఆయన విగ్రహానికి పలువురు నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రాను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని డెబ్బయ్యవ దశకంలోనే కాకాని డిమాండ్ చేశారని, అప్పుడే అలా జరిగితే ఇప్పటికి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మాట్లాడుతూ స్వాతంత్య్రం రాక ముందు జిల్లాలో 9 పాఠశాలలు మాత్రమే ఉండేవని, వెంకటరత్నం మంత్రి అయిన తర్వాత 180 పాఠశాలలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బెంజిసర్కిల్‌కు కాకాని సర్కిల్ నామకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో డాక్టర్ తరుణ్ కాకాని మాట్లాడుతూ కాకాని ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం కలపాల సూర్యప్రకాశరావు జీవిత అనుభవాల పుస్తకాన్ని ఆయన కుమారుడు వినయ్‌సాగర్ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముసునూరి రత్నబోస్, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (న్యూఢల్లీి) చైర్మన్ నాగులపల్లి భాస్కరరావు, కలపాల వినయ్‌సాగర్, గోగినేని ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …