Breaking News

ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా శాఖాధిపతులు ఫీల్డ్ లెవెల్ లో వెళ్లి, వెరిఫై చేసిన తర్వాతే తగిన పరిష్కారం అందిస్తున్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రధాన కార్యాలయంలోనే కాకుండా జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తూ నిత్యం పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 16 ఫిర్యాదులు అందగా అందులో ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగం లో 8 అందుకున్నారు, ఇంజనీరింగ్ 7, హోసింగ్ ఒకటి, ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, డెప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, ఇంచార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఇంచార్జ్ ఎస్టేట్ ఆఫీసర్ మరియు జోన్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, సుప్రిండెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, ఆర్ ఎఫ్ ఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *