విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రహ్మణ సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఆదివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే వారిని సహించేది లేదన్నారు. అలా వ్యవహరించే వారిని సంఘం పదవుల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొందరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. మాతృ సంఘాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని వివరించారు. అటువంటి వారందరినీ రాష్ట్ర సంఘ కార్యకలాపాల్లో పాల్గొనకుండా బహిష్కరిస్తున్నామన్నారు. సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చేవూరు రామస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఫిరంగి చంద్రశేఖర్, గౌరవ సలహాదారులు సూర్యనారాయణ, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా బి.నీరజ, రాష్ట్ర మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీదేవి, గురజాడ రాజేశ్వరి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విజయలక్ష్మి, లత, వరలక్ష్మిని ఎన్నుకున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
