Breaking News

స్వయం సహాయక బృందాల లబ్ధిదారులకు తృప్తి కాంటీన్ కు రుణ మంజూరు లేఖ పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నెల్లూరులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ (MA & UD) మంత్రి పొంగూరు నారాయణ  ఆద్వర్యంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి క్యాంటీన్ కు, ప్రజల నుంచి ఆదరణ బాగుండడంతో విశాఖపట్నం, విజయవాడలో మరో నాలుగు క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం పంజా సెంటర్ వద్దగల షాది ఖానా దగ్గర తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేసుకునేందుకు స్వయం సహాయక బృందాల లబ్ధిదారులకు రుణ మంజూరు లేఖను పంపిణీ చేశారు అధికారులు.

పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉపాధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక వినూత్న కార్యక్రమాల్లో తృప్తి క్యాంటీన్ ఒకటి. బ్యాంకుల నుంచి సంఘాలకు పెట్టుబడి నిధి కింద రుణాలు అందించి వాటితో తృప్తి క్యాంటీన్లు ప్రారంభించాలన్నది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రణాళిక. విజయవాడలో 4 క్యాంటీన్లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కంటెయినర్ల సమీకరణ, కిచెన్ ఎక్విప్మెంట్ మొదలగు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో క్యాంటీన్ ఏర్పాటుకు రూ. 14.51 లక్షలు అవసరం అవుతుందని అంచనా. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా వీటిని ఏర్పాటు చేయడము జరుగుతుంది. మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్, IAS, MEPMA, ఆంధ్రప్రదేశ్ వారు, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పంజా సెంటర్, షాదీఖానా సమీపంలోని తృప్తి క్యాంటీన్‌ను సందర్శించారు. భారత ఓవర్సీస్ బ్యాంక్, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ద్వారా తృప్తి క్యాంటీన్ SHG మహిళా లబ్దిదారులకు ఋణ మంజూరు లేఖల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ, ప్రాజెక్ట్ ఆఫీసరు (యు.సి.డి) పి. వెంకట నారాయణ, IOB అధికారులు, MEPMA అధికారులు పాల్గొన్నారు.
అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *