Breaking News

ఆంధ్రప్రదేశ్‌ మామిడి రైతులను ఆదుకోవాలి..

-కేంద్ర వ్యవసాయ మంత్రికి ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. లేఖలో ఎంపీ పేర్కొన్న వివరాల ప్రకారం, దేశంలోనే అత్యధికంగా 12.35 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందన్నారు. ఇది దేశ మామిడి సాగు విస్తీర్ణంలో 16.5 శాతం వాటాను కలిగి ఉందని, అయితే విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉండడం సాగు పరంగా పలు మౌలిక సమస్యలను సూచిస్తోందని పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలో విస్తృతంగా సాగు అయ్యే తోతాపురి మామిడి ధరలు భారీగా క్షీణించడంతో రైతులు నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మామిడి మద్దతు ధర కిలోకు రూ.12 ఉన్నప్పటికీ రైతులు కిలో కేవలం రూపాయి నుండి నాలుగు రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, ఇది పంట పెట్టుబడులను కూడా తిరిగి పొందహలేని దుస్థితి అని వివరించారు. మామిడి కోత కూలీల కోసం చేసిన ఖర్చులు కూడా అందకుండా పోవడంతో చెట్లపైనే మామిడిని వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి ధర పతనంతో ఉత్పన్నమైన పలు కారణాల వలన చిత్తూరు-తిరుపతి ప్రాంతంలో ఉన్న 52 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లలో 28 యూనిట్లు మూతపడినట్లు లేఖలో వివరించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ మామిడి ఎగుమతుల్లో 20% వాటా కలిగి ఉన్నా, రైతులు ఆ తాయిలో లాబాలను అందుకోలేకపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తోతాపురి మామిడిని ₹12 మద్దతు ధరకు కొనుగోలు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర వ్యవసాయ ధరల సంఘం, సిసిఇఎ సమన్వయంతో ప్రత్యేక పథకం తీసుకురావాలని కోరారు.

ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం తిరుపతిలో “నేషనల్ మ్యాంగో బోర్డు” ఏర్పాటు చేయాలని, ఇది ధరల స్థిరీకరణ, మార్కెట్ అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం, రైతు సమాఖ్యలకు మద్దతు వంటి కార్యకలాపాలు నిర్వహించగలదని సూచించారు. అలాగే చిత్తూరు జిల్లాలో “జాతీయ మామిడి పరిశోధనా కేంద్రం” ఏర్పాటు చేసి పంట దిగుబడి మెరుగుదల, తెగులు నివారణ, వాతావరణ అనుకూల సాగు పద్ధతులపై పరిశోధనలు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న రైతు ఆదాయం రెట్టింపు, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటాయని ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *