Breaking News

ట్రంప్ ఆంక్షలు వల్ల వ్యవసాయ, అనుబంధ రంగాలు కుదేలు… : పి.జమలయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశం నుండి అమెరికాకు దిగుమతి అవుతున్న వ్యవసాయ, ఆక్వా తదితర ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50శాతం సుంకాలను విధించారు. ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు.సుంకాలు విధింపు వలన అమెరికాకు దిగుమతి అవుతున్న రొయ్యలు ధరలు పెరగుతున్నాయని కొనుగోలు చేసే బయ్యర్లు చేతులెత్తేశారు.దీంతో భారతదేశం నుంచి ఎగుమతి చేసే వ్యాపారస్తులు సుంకాల సాకు చూపించి తక్కువ ధరలకు కొనుగోలు చేసి రొయ్యల రైతులను నిలువున దోచేస్తున్నారు.
ఈ సుంకాలు విధింపు నేపథ్యం ఏమిటంటే రష్యా నుంచి ముడి చమురును భారత దేశం కొనుగోలు చేస్తన్నదని దీని వల్ల రష్యాకు ఆదాయం పెరిగి ఉక్రెయిన్ పై దాడికి ఆ సొమ్మును వినియోగిస్తారని నెపంతో అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ భారత దేశం నుండి అమెరికాకు దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై 50% సుంకాలు విధించారు.మన దేశంలో వ్యవసాయ,మత్స్య,ఆక్వా తదితర ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రపై తీవ్ర ప్రభావం పడుతుంది.
◆రాష్ట్రం నుంచి ఇప్పుడిప్పుడే అమెరికాకు పలు వ్యవసాయ, ఉద్యాన,ఇతర ఉత్పత్తులు ఎగుమతులు అవుతున్నాయి.
వీటిలో రొయ్యలు,దంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం,పాలిస్ట్ బియ్యం, పిండి, జీడిపప్పు, బెల్లం పొడి ,టమాట, పిస్తా, మినరల్ వాటర్ ,రోస్టెడ్ నట్స్,తృణ ధాన్యాల ఉత్పత్తులు మొదలైనవి ఉన్నవి. వీటి వల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా మన దేశానికి చేకూరుతుంది.
★ట్రంపు భారీ సుంకాల వలన ఆక్వా రంగంపై భారీ దెబ్బ పడనున్నది.గతంలో 25శాతం సుంకాలు ఉంటేనే ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా 50శాతం పెంచడం వలన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఆక్వా రంగానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఆయిపట్టు. ఈ రెండు జిల్లాల నుంచే 60 శాతం ఉత్పత్తి జరుగుతుంది.దేశవ్యాప్తంగా ఏటా 10 నుంచి 11 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుండగా అందులో ఉభయగోదావరి జిల్లాలో 3 లక్షల టన్నులు రొయ్యలు ఉత్పత్తి జరుగుతుంది.మొత్తంగా ఉత్పత్తి అయిన రొయ్యలలో అమెరికాకు 60 శాతం,చైనాకు 30% ఎగుమతి అవుతున్నాయి. వీటి ద్వారా భారీగా విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుంది. భీమవరం నుంచి కాకినాడ జిల్లా, తాళ్ళరేవు వరకు వందల సంఖ్యలో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి తీరా ప్రాంతంలో రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హెచ్ రీస్ లు ఉన్నాయి.పెంచిన సుంకాలు
ఆగస్టు 27 నుంచి అమలులోకి వస్తాయి కానీ వ్యాపారస్తులు ఇప్పటినుంచే ధరలు తగ్గిస్తున్నారు. గతంలో కిలోకి 25 కౌంట్ తూగే రొయ్యల ధరలు రూ.565 నుంచి రూ.430లకు తగ్గించారు. దీంతో రొయ్యల రైతులు లబో దిబోమంటున్నారు.
◆ అమెరికాకు రొయ్యల ఎగుమతులు ఏపీ ప్రధానమైన వాటదారుడుగా ఉంది.ప్రతి ఏడాది దాదాపు రూ.20వేల కోట్ల విలువ గలిగిన రొయ్యలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంటే ఇందులో అమెరికాకు వెళ్లే రొయ్యల విలువ రూ.16 వేల కోట్లు. ఈ సుంకాలు విధింపు వలన టన్నుకు రూ.40 వేలకు పైగా నష్టం వాటిల్లింది. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉంది.దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గిపోతుంది.
★రాష్ట్రంలో అధికారికంగా సుమారు 2.50 లక్షలఎకరాల్లో రొయ్యల చేరువులు ఉన్నాయి.మరో లక్షన్నర ఎకరాల చెరులలో అనధికారికంగా రొయ్యలు ఉత్పత్తి సాగవుతుంది. ఆక్వా రంగంపై ప్రత్యక్షంగాని,పరోక్షంగా గాని 20 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇవే గాక ప్రాసెసింగ్ యూనిట్లలోను,రొయ్యల పిల్లలు ఉత్పత్తి చేసే హెచ్ రీసస్ లో పనిచేసే అసంఘటిత కార్మికుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. ఎగుమతులు పడిపోతే ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది.సాగు కుదించకు పోయి దిగుబడి తగ్గి పోతుంది. దీంతో పోస్సెసింగ్ యూనిట్లపై కూడా ప్రభావంపడి ఉపాధి దెబ్బతింటుంది. వారి కుటుంబాలు వీధిన పడి తీవ్ర సంక్షోభానికి గురవుతారు.
★ ప్రస్తుతం ఒక ఎకరాకు 1.50లక్షల రొయ్య పిల్లలు వదులుతున్నారు.
టన్ను మేత రూ.80వేలు అయింది. చెరువులో వదిలే రొయ్య పిల్లల సంఖ్య 3 రొట్లు పెరగటంతో అదే రీతిలో మేత ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. ఎకరానికి కౌలు కూడా ఒక లక్ష నుంచి 1లక్ష 50 వేల రూపాయలకు చేరింది.పది ఎకరాలు లోపు ఉన్న రైతుకు యూనిట్ 1.50 పైసలకు విద్యుత్ ఇచ్చినప్పటికీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు బిల్లులు చాలా అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం వస్తున్న బిల్లులపై ట్రూ ఆఫ్ చార్జీలు భారీగా పెరిగాయి. చార్జీలు భారం మోయలేని పరిస్థితి ఏర్పడింది. రొయ్యలకు మద్దతు ధరలు ప్రకటించాలనే డిమాండ్ కూడా రైతుల నుంచి ఉంది. సీడ్,ఫీడ్ మరియు యాంటీ బయోటిక మందుల దరలు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా కంటి తుడుపు చర్యలతో సరిపుచుతున్నారు. ఈ సుంకాల బారి నుండి ఆక్వారంగాన్ని రక్షించడానికి ప్రత్యామ్నాయాలు అన్వేషించాలి.
భారతదేశంపై ట్రంప్ విధించిన 50% సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికాతో ఉన్న ఒప్పందాలు,డబ్ల్యూటిఓలోని ఫిర్యాదు అవకాశాలు ఉపయోగించి సుంకాల తగ్గింపు కోసం చర్చలు జరపాలి.అమెరికా నుండి దిగుమతి అవుతున్న కొన్ని వస్తువులపై తగిన ప్రతిసుంకాలు విధించడం ద్వారా సమాన ఒత్తిడి సృష్టించాలి.
ఎగుమతులు చేయడానికి అమెరికా మార్కెట్‌కి బదులుగా యూరోప్, దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి కొత్త మార్కెట్లు అన్వేషించాలి.ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాల ద్వారా లేదా ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా సుంకాల ప్రభావం తగ్గించుకోవచ్చు.ఎగుమతి సబ్సిడీలు మరియు పన్ను రాయితీలు, ప్రభావితమైన రంగాలకు తాత్కాలిక సహాయం అందించాలి.తాత్కాలిక మార్కెట్ మార్గాలు గాకుండా దీర్ఘకాలిక మార్గాలు అన్వేషించాలి. ఒకే దేశంపై అధికంగా ఆధారపడటం తగ్గించి, ఎగుమతులను విస్తృతంగా పెంచుకోవాలి.దేశీయ డిమాండ్ పెంపుకు చర్యలు తీసుకోవాలి.
ఎగుమతి మార్కెట్ క్షీణించినపుడు దేశీయ వినియోగాన్ని పెంచడం ద్వారా ఉత్పత్తిదారులకు మద్దతు ఇవ్వాలి.ఉత్పత్తి ఖర్చు తగ్గించాలి.
వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను పెంచడానికి మౌలిక సదుపాయాల మెరుగుదల చేయాలి లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించాలి, సాంకేతికత వినియోగం ద్వారా పోటీ సామర్థ్యం పెంచాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పి.జమలయ్య అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *