Breaking News

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి రాఖీ కట్టిన ఏపీ విద్యార్థులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రపతి భవన్ లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ని శనివారం కలిసి బాలికలు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు సంబంధించిన 720 మంది విద్యార్థిని, విద్యార్థులు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ నుండి 8మంది విద్యార్థినులు, ముగ్గురు ఎస్కార్టు టీచర్లు, నోడల్ ఆఫీసరుగా శామో విభాగం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శైలా. కల్పన వ్యవహరించారు.

పాల్గొన్న విద్యార్థులు
బాపట్ల జిల్లా బల్లికురవ కేజీబీవీ నుండి బి.హేమ, పి.శైలజ, చినగంజాం కేజీబీవీ నుండి డి. కీర్తి, బి. ప్రజ్ఞ, ఎన్టీఆర్ జిల్లాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస్ విద్యాలయం నుండి కె.రామతులసి, జి. కృపా, పటమట కేబీసీ బాయ్స్ హైస్కూల్ నుండి సీహెచ్. శ్రావణి, ఎస్. రామ లక్ష్మి పాల్గొన్నారు. వీరికి ఎస్కార్టులుగా కె.సి.హెచ్ శాంతమ్మ, షేక్ కరీమా, ఎం. పుష్య రాగం ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల బృందం రాఖీలు కట్టి, ఆంధ్రా మిఠాయిలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి విద్యార్థులతో మాట్లాడి, రక్షాబంధన్ సందర్భంగా అందరూ మొక్కలు నాటాలన్నారు. అనంతరం విద్యార్థులను రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, సైన్స్ మ్యూజియం వంటివి విద్యార్థుల బృందం సందర్శించారు. ఈ అవకాశం కలిగించిన సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS. కి విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *