విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో భాగంగా 41 వ డివిజన్ పరిధిలోని దర్గా ప్లాట్లు, బేతపూడి అరుణ కుమారి వీధి, బాజీ బాబా మందిరం రోడ్డు తదితర ప్రాంతాల్లో కచ్చా రోడ్లు , సీ సీ రోడ్ల నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపనలు చేశారు. సుమారు రూ 1 కోటి 32 లక్షల నిధులతో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధింత అధికారులకు సూచించారు. డివిజన్ కు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే సుజనా కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
చందాలకు, దందాలకు పశ్చిమ నియోజకవర్గంలో తావు లేదని ఉద్ఘాటించారు. కొంతమంది పండుగల పేరుతో , ఉత్సవాల పేరుతో చందాలు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. చందాలు సేకరించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా చందాలు డిమాండ్ చేసినా, దురుసుగా ప్రవర్తించినా ఎన్డీఏ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సుజనా కోరారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ జే శ్రీనివాస్, ఎ ఈ జాస్మిన్, డీ ఈ పురుషోత్తంఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ , కార్పోరేటర్ మహ్మద్ ఇర్ఫాన్,కూటమి నేతలు యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు, కురాకుల సురేష్, పైలా సురేష్, అవ్వారు బుల్లబ్బాయి, మంగళపురి మహేష్, ఏలూరి సాయి శరత్,పచ్చిపులుసు శివప్రసాద్ సుజనా మిత్రా కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News