విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో కమ్మవారి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆదివారం విజయవాడ సమీపంలో పోరంకి నిడమానూరు రోడ్డులో మురళీ రిసార్ట్, శ్రీ ముత్తవరపు వెంకటేశ్వరరావు ప్రాంగణంలో కమ్మవారి సేవా సమితి, గ్రేటర్ విజయవాడ వారి ఆధ్వర్యంలో కమ్మవారి సంక్రాంతి సంబరాలు అత్యద్భుతంగా జరిగాయి. ఈ వేడుకలో విశిష్ఠ అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి గారపాటి రేణుకా చౌదరి, ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ప్రపంచ చదరంగ విజేత కోనేరు హంపి పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడల్లో ప్రఖ్యాతిగాంచిన పలువురిని సన్మానించారు ఈ సంబరాలలో భాగంగా ఆహ్లాదకర వాతావరణంలో విందు, వినోదం, ఆటలు, పాటలు, అతిథుల ప్రసంగాలు, ఆత్మీయ సత్కారాలు, బహుమతి ప్రధానాలు జరిగాయి.
పందెపు ఎడ్లు, పొట్టేళ్ళు, కోడి పుంజులు, పక్షులు మరియు పుంగనూరు ఆవుల ప్రదర్శన, వీర నాట్యం, గరగలు, బుర్రకథ, హరిదాసు, మరియు గంగిరెద్దుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. మహిళలకు తంబోలా , హౌసీ , లెమన్ అండ్ స్పూన్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. కమ్మవారి సేవా సమితి , గ్రేటర్ విజయవాడ కార్యవర్గం, కమ్మవారి సంక్రాంతి సంబరాలు ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు ఈ సంబరాలను సాంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. కమ్మవారి సేవా సమితి ప్రెసిడెంట్ నన్నపనేని నాగేశ్వరరావు, బొర్రా రాధాకృష్ణ (గాంధీ), గుమ్మడి రామకృష్ణ, ముత్తవరపు శివరామకృష్ణ, చనమోలు సురేష్, సూరపనేని కృష్ణారావు, సూరపనేని స్వరూపరాణి, చెన్నుపాటి ఉషారాణి, తోటకూర శ్రీనివాసరావు, పెద్ది ప్రఫుల్ల చంద్ర, నాదెళ్ల రాజేష్, ఉప్పలపాటి ప్రవీణ్ తదితరులు ఈ సంబరాలను జయప్రదం చేశారు.
Prajavartha Online Telugu News