Breaking News

నీరు-చెట్టు బిల్లులను క్లియర్ చేసిన ఆర్థిక శాఖ

-ఈ వారంలో అప్ లోడ్ అయిన రూ. 40 కోట్ల బిల్లులను ప్రాసెస్ లో పెట్టిన ఆర్థిక శాఖ
-గతంలోనే రూ. 800 కోట్ల మేర నీరు-చెట్టు బిల్లులకు చెల్లింపులు జరిపిన ఫైనాన్స్ విభాగం
-జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సమస్య వల్ల ఇంకా ఆర్థిక శాఖకు చేరని రూ. 60 కోట్ల బిల్లులు
-రూ. 60 కోట్ల బిల్లుల సాంకేతిక సమస్య తీర్చేందుకు ఇరిగేషన్ ఈఈ ఆఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు
-నీరు-చెట్టు బిల్లుల చెల్లింపులపై ఫైనాన్స్, ఇరిగేషన్, జీఎస్టీ అధికారులతో ఆర్థిక మంత్రి సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2014-19 మధ్య కాలానికి చెందిన నీరు-చెట్టు పథకానికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల ప్రక్రియను రాష్ట్ర ఆర్థిక శాఖ దాదాపు పూర్తి చేసింది. ఆర్థిక శాఖ వద్దకు వచ్చిన బిల్లులన్నింటినీ ఇప్పటికే క్లియర్ చేసింది. నీరు-చెట్టు బిల్లుల చెల్లింపులపై సీఎం చంద్రబాబు సూచనలతో ఆర్థిక మంత్రి పయ్యావుల ఎప్పటికప్పుడు ఇరిగేషన్, ఫైనాన్స్ అధికారులతో వరుస సమీక్షలు జరుపుతున్నారు. దీంట్లో భాగంగా ఫైనాన్స్, ఇరిగేషన్, జీఎస్టీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఆదివారం మంత్రి పయ్యావుల సమావేశమయ్యారు. ఈ వారం అప్ లోడ్ అయిన రూ. 40 కోట్ల నీరు-చెట్టు బిల్లుల చెల్లింపుల ప్రక్రియపై సమీక్షించారు. వెంటనే బిల్లులను చెల్లింపుల ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 800 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు జరిగాయని సమావేశంలో మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం చెల్లింపుల ప్రక్రియలో ఉన్న రూ. 40 కోట్ల బిల్లులతో కలుపుకుని మొత్తంగా రూ. 840 కోట్లు చెల్లింపులు జరిపినట్టు అవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. ఇంకా ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే వాటిని కూడా త్వరితగతిన చెల్లింపుల ప్రక్రియలో పెట్టాలని మంత్రి పయ్యావుల ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అయితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల సుమారు రూ. 60 కోట్ల మేర బిల్లులు అప్ లోడ్ కావడం లేదని.. దీంతో ఇవి ఆర్థిక శాఖ వద్దకు రాలేదని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై జీఎస్టీ అధికారులతో మంత్రి చర్చించారు. ప్రతి ఈఈ కార్యాలయంలో ఇరిగేషన్, జీఎస్టీ అధికారులతో ఓ కౌంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. సదురు కాంట్రాక్టర్లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను దగ్గరుండి చేయించాలని… అలాగే త్వరితగతిన బిల్లులను అప్ లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పయ్యావుల ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా జీఎస్టీ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీఎస్టీ సమస్యతో పెండింగులో ఉన్న రూ. 60 కోట్లకు సంబంధించిన బిల్లులను చెల్లించడానికి ఆర్థిక శాఖ సిద్దంగా ఉందని పయ్యావుల చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బిల్లులను త్వరితగతిన అప్ లోడ్ చేయించి ఆర్థిక శాఖ వద్దకు చేరేలా చూడాలని ఇరిగేషన్, జీఎస్టీ అధికారులకు మంత్రి ఆదేశించారు. నీరు-చెట్టు బిల్లుకు సంబంధించి ఇంకా ఏమైనా పెండింగ్ విషయాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ ను మంత్రి పయ్యావుల కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *