Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలతో ప్రజలు సంతృప్తిగా ఇంటికి వెళ్లగలిగే పరిస్థితి రావాలి

-వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరగాలి
-వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉపేక్షించం.. కఠిన చర్యలు తీసుకుంటాం
-నూజివీడు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సమావేశంలో వైద్య సిబ్బందిని హెచ్చరించిన- మంత్రి కొలుసు పార్థసారధి
-ఆసుపత్రిలో అన్ని వార్డులను పరిశీలించి వైద్య సేవలపై రోగులతో మాట్లాడిన మంత్రి పార్థసారధి

ఏలూరు, నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని అందుకుతగిన విధంగా ప్రజలకు అందించే సేవలలో ఫలితాలు రావాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి చెప్పారు. నూజివీడు ఏరియా ఆసుపత్రిలోని వార్డులను ఆదివారం మంత్రి పార్ధసారధి పరిశీలించారు. వైద్య సేవలను గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. వార్డులలో, ఆవరణలో పరిశుభ్రత పరిశీలించారు. ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లను కూడా మంత్రి పరిశీలించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ లో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రతీ రోగి ఆసుపత్రిలో సేవలతో సంతృప్తిగా ఇంటికి వెళ్లగలిగే పరిస్థితి తప్పనిసరిగా రావాలని అదే ప్రభుత్వ ఆశయమన్నారు. అందుకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలన్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వ ప్రభావం ప్రభుత్వ ప్రతిష్టపై పడుతుందని ఇది సహించరాని నేరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సిసి కెమెరాలు పనిచేసే స్థాయిలో ఉండాలని, రోగులకు సిబ్బంది అందించే సేవలపై వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది రోగులకు మెరుగైన సేవలందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై రోగులు ఫిర్యాదు చేస్తే వెనువెంటనే విచారణ చేసి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలోని వార్డులు, ఆవరణ పూర్తి పారిశుద్ధ్య పరిస్థితులు ఉండాలని ఆసుపత్రి ఆవరణలో అంతా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా గార్డెన్డింగ్ నిర్వహించాలన్నారు. పార్లమెంట్ సభ్యుల అభివృద్ధి నిధుల నుండి అందించిన అంబులెన్స్ కు డ్రైవర్ లేని కారణంగా వినియోగించుకోలేకపోతున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. ఆసుపత్రిలో నిబంధనల మేరకు కేవలం 8 వేల రూపాయలు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నందున, పీ4 కార్యక్రమంలో భాగంగా నితిన్ కృష్ణ కన్స్కృక్షన్స్ అధినేత నితిన్ కృష్ణ వెంటనే లక్ష రూపాయలు చెక్కు ద్వారా అందిస్తానని చెప్పారన్నారు.

సబ్ కలెక్టర్ బి, వినూత్న హాస్పటల్ సూపరింటెండెంట్, అభివృద్ధి కమిటీ,సభ్యులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *