-ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్
-అదరహో అనే విధంగా యువతను, ప్రజలను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
-కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు
-కేరింతల సందడితో జన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణం
-వివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత
సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 రెట్టించిన ఉత్సాహంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. రెండవ రోజైన ఆదివారం నాడు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో సూళ్లూరుపేట పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణం నిండింది.
జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న 2026 ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాలలో భాగంగా పశుసంవర్ధక, పోలీస్, వైద్య, ఆరోగ్యశాఖ, ఉద్యాన, మెప్మా, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ- జిల్లా డ్వాక్రా మహిళల ఉత్పత్తులు, అటవీశాఖ- వన్యప్రాణి విభాగం, పర్యాటక, ఐసిడిఎస్ శాఖలు, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్,షార్ , శ్రీహరి కోట, నారాయణ, వీనస్ హాస్పిటల్స్ వారి ఉచిత వైద్య శిబిరాలు, ఆప్కో, శ్రీ సిటీ లకు చెందిన స్టాల్స్, స్థానికంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్స్ లు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన చిన్న పిల్లలకు, పెద్దలకు సంబంధించిన రంగుల రాట్నాలు, జాయింట్ వీల్స్, వాటర్ స్పోర్ట్స్ లలో ఉత్సాహంగా పాల్గొని ఆనందించారు. ప్రధాన వేదిక వద్ద ప్రముఖ సినీ నేపద్య గాయకుడు సాకేత్ ,పలువురు గాయకులు, ప్రఖ్యాత జబర్దస్త్ టీం కళాకారులు రాకేష్, సుజాత, చంటి, సత్య డాన్స్ మాస్టర్ తదితరులు పాల్గొని ప్రజలను, యువత, విద్యార్థినీ, విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా సినీ గీతాలు వినోద, హాస్య, నృత్యాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తృత్వ, వ్యాసరచన, ఆటల పోటీలలో విజేతలైన వారికి ప్రశంసా పత్రాలు స్థానిక ఎమ్మెల్యే అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించారు. ఆచిత్ర దర్శకులు కిషోర్ తిరుమల ,హీరోయిన్లు డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ తమ చిత్రం గురించి వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ ,చిత్ర బృందాన్ని శాలువులతో సత్కరించారు ఈ సత్కార కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు
స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్‌ను, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం 2025లో తిరిగి ప్రారంభించామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ , టూరిజం మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. సైబీరియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఫ్లెమింగో పక్షులు ఈ నియోజకవర్గం లోని పులికాట్ సరస్సు నేలపట్టు ప్రాంతాలకు వస్తాయన్నారు . ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ను ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్ఏ నెలవల విజయ శ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ .ఎస్ .వెంకటేశ్వర్,జిల్లా ఎస్పీ ఎల్ . సుబ్బరాయుడు, గూడూరు , వెంకటగిరి ఎంఎల్ఏలు పాశం సునీల్ కుమార్, కొరుగొండ్ల రామకృష్ణ, మాజీ కేంద్రమంత్రి వర్యులు పనబాక లక్ష్మి, మాజీ మంత్రివర్యులు పరసారత్నం, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్,మాజీ ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డి, సూళ్లూరుపేట మునిసిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి,స్థానిక ఆర్డీవో కిరణ్మయి ,టూరిజం ఆర్డి రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్దన్ రెడ్డి ,డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ , మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య,ఇతర ప్రజాప్రతినిధులు , అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News