Breaking News

ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ విజయవాడ రూరల్ నందు అంగన్వాడి కార్యకర్తలు మరియు అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీ.

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యన్.టి.ఆర్ జిల్లా విజయవాడ రూరల్ పరిధిలోని అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తునట్లు సి.డి.పి.ఓ పి. భానుమతి ప్రకటనలో తెలిపారు. విజయవాడ పరిధిలోని అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు 8 వ డివిజన్ లోని ఇజ్రాయిల్ పేట-2 నందు SC-II కేటగిరి లో షాబాద్ గ్రామము షాబాద్ నందు OC కేటగిరిలో, గొల్లపూడి గ్రామము గొల్లపూడి-8 నందు SC-II కేటగిరిలో, గొల్లపూడి-16 నందు BC-A కేటగిరిలో, గొల్లపూడి-17 నందు OC కేటగిరిలో, గొల్లపూడి – 18 నందు BC-E కేటగిరిలో, జక్కంపూడి గ్రామము జక్కంపూడి-2 నందు ST కేటగిరిలో, నున్న గ్రామము నున్న -8 నందు OC కేటగిరిలో, పి నైనవరం గ్రామము పి నైనవరం-1 నందు SC-III కేటగిరిలో, అంబాపురం గ్రామము అంబాపురం-3 నందు OC కేటగిరిలో, పాతపాడు గ్రామము మంగళాపురం-2 నందు OC కేటగిరిలో, రామవరప్పాడు గ్రామము రామవరప్పాడు-3 నందు OC కేటగిరిలో, ప్రసాదంపాడు గ్రామము ప్రసాదంపాడు -8 నందు BC-C కేటగిరిలో, నిడమానూరు గ్రామము నిడమానూరు-8 నందు SC-II కేటగిరిలో, 2వ డివిజన్ గుణదల – 4 నందు BC-C కేటగిరిలో, 3వ డివిజన్ ఆటో నగర్ నందు BC-B కేటగిరిలో, 4వ డివిజన్ వర లక్ష్మి నగర్ నందు OC కేటగిరిలో, 5వ డివిజన్ క్రీస్తురాజ్ పురం-1 నందు OC కేటగిరిలో, 5వ డివిజన్ క్రీస్తురాజ్ పురం-2 నందు SC-III కేటగిరిలో, 7వ డివిజన్ మోఘల్రాజ్ పురం-5 నందు BC-A కేటగిరిలో, 7వ డివిజన్ మోఘల్రాజ్ పురం-6 మినీ నందు BC-B కేటగిరిలో, 14వ డివిజన్ అంబేద్కర్ నగర్ నందు OC కేటగిరిలో, 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్-4 నందు OC కేటగిరిలో, 16వ డివిజన్ మదుసూదన నగర్ నందు OC కేటగిరిలో, 16వ డివిజన్ బాలాజీ నగర్-2 నందు OC-EWS కేటగిరిలో, 16వ డివిజన్ బాలాజీ నగర్-3 నందు OC కేటగిరిలో, 17వ డివిజన్ రాణిగారి తోట-1 నందు OC కేటగిరిలో, 18వ డివిజన్ రాణిగారి తోట-4 నందు BC-A కేటగిరిలో, 19వ డివిజన్ భవానిపురం-1 నందు BC-E కేటగిరిలో, 19వ డివిజన్ భవానిపురం-3 నందు BC-E కేటగిరిలో, 20వ డివిజన్ గౌతమీ నగర్ నందు OC కేటగిరిలో, 20వ డివిజన్ కరకట్ట -1 నందు BC-D కేటగిరిలో అంగన్వాడి సహాయకురాళ్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగింది. యస్.సి. కులమునకు గ్రూప్-1 నందు బావూరి, చచాటి, చందాల, దందాసి, డోమ్, దొమ్బర, పైడి, పానో, ఘాసి, హద్ది, రెల్లి చాచండి, గోడగాలి, గొడగుల, మెహర్, పాకి, మొటి, తోటి, పమిడి, రెల్లి, సాపు వారు గ్రూప్-2 నందు అరుంధతీయ, బైండ్ల, చమర్, మోచి, ముచ్చి, చమర్-రవిదాస్, చమర్-రోహిదాస్, చంభర్, డక్కల్, డక్కల్వార్, ధోర్, గోదారి, గోసంగి, జగ్గలి, జంబువులు, కొలుపులవాండ్లు, పంబాడ, పంబండ, పంబల, మాదిగ, మాదిగ దాసు, మల్టీన్, మాంగ్, మాంగ్ గరోడి, మాతంగి, సమాగర, సింధోల్లు, చిందోల్లు వారు గ్రూప్-3 నందు ఆది ద్రవిడ, అనముక్, అరే మాల, అర్వా మాల, బారికి, బైగారి, బైగారా, చలవాడి, ఎల్లమాలవారు, ఎల్లమ్మలవాండ్లు, హెూలెయ హెూలెయ దాసరి, మాదాసి కురువ, మాదారి కురువ, మహర్, మాల, మాల అయవారు, మాల దాసరి, మాలా దాసు, మాలా హన్నాయి, మాలజంగం, మాల మస్తీ, మాలా సేల్, నెట్కాని, మాల సన్యాసి, మన్నే, ముండల, సాంబన్, యటల, వళ్ళువన్, ఆది ఆంధ్ర, మాష్టి, మిత అయ్యాళ్వార్, పంచమ, పరియా వారు అర్హులని తెలియజేయుచూ అంగన్వాడి కేంద్రాలలో పైన తెలిపిన అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాళ్ల పోస్టులకు ది. 01.07.2026 నాటికి 21 సంవత్సరములు నిండియుండి 35 సంవత్సరములలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణం పొందిన స్థానికంగా వివాహిత రాలై ఉండవలెను. అర్హత గల అభ్యర్థినిలు అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త, ఆయా పోస్టుల కొరకు ఎస్.సి., ఎస్.టి మరియు బి.సి. అభ్యర్థినిలు కుల ధృవీకరణ పత్రములు, ఓ.సి. అభ్యర్థులు EWS (ఆర్థికంగా బలహీన వర్గం) పత్రము, నివాస దృవీకరణ పత్రాలు, ఆధార్, రేషన్ కార్డులను దరఖాస్తు ఫోరంతో పాస్ పోర్ట్ సైజు ఫోటో జత చేసి తేది. 05.02.2026 సాయంత్రం 5 గంటల లోపు కానూరు నందు గల సి.డి.పి.ఓ, విజయవాడ రూరల్ కార్యాలయం నందు వ్యక్తిగతముగా అందజేయాలని సి.డి.పి.ఓ పి. భానుమతి ఒక ప్రకటనలో తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *