-విద్యార్థులు పరీక్షల దృష్ట్యా ఒత్తిడి, భయాందోళన చెందవద్దు
-విద్యార్థులతో కలిసి పరీక్షా పే చర్చ కార్యక్రమం వీక్షించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ విజయ్ రామరాజు. వి IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదో తరగతి పరీక్షలు జీవితంలో ఒక భాగమేనని, పరీక్షల విషయంలో విద్యార్థులు ఎలాంటి భయాందోళన, ఒత్తిడి చెందవద్దని, సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నాపత్రం సమాధానాలు మూల్యాంకనం చేసే వ్యక్తి ఆ ప్రశ్న ద్వారా విద్యార్థుల విషయ అవగాహనను ఏమి ఆశిస్తున్నారు తెలుసుకొని సమాధానాలు రాయాలని, ప్రశ్నకు సంబంధించి ముఖ్యమైన విషయాలను స్పృశించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ విజయ్ రామరాజు. వి IAS., అన్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ (9Th Edition) కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులతో కలిసి సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి వీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ ఏ ఉద్యోగానికైనా పదో తరగతి అవసరమని వివరిస్తూ, పరీక్షలకు సన్నద్ధమయ్యే మెలకువలు, ఆహార నియమాలు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ నుండి గత ఏడాది 2025,డిసెంబరు 1 నుండి 2026,జనవరి 11 వరకు విద్యార్థులు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు 23,84,230 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, శుక్రవారం జరిగిన ప్రత్యక్ష ప్రసారాన్ని అన్ని మాధ్యమాల ద్వారా దాదాపు 49,77,857 మంది వీక్షించారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో జరిగిన పరీక్ష ప్రత్యక్ష కార్యక్రమంలో నేరుగా పాల్గొన్న షేక్ జమీర్ భాష పదవ తరగతి విద్యార్థిని కమీషనర్ అభినందించారు. పరీక్ష పై చర్చ వీక్షించిన విద్యార్థులందరికీ ప్రధానమంత్రి రచించిన ఎగ్జామ్ వారియర్ పుస్తకాలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం. వెంకటకృష్ణారెడ్డి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీలు డా. ఎం.ఆర్.ప్రసన్నకుమార్, కె.రవీంద్రనాథ్ రెడ్డి, కేజీబీవీ సెక్రటరీ డి.దేవానందరెడ్డి , ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి , మధ్యాహ్న భోజన పథకం జాయింట్ డైరెక్టర్ ఆర్.ఎస్.గంగాభవానీ , ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ , విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News