Breaking News

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ని మరింత పటిష్టం చెయ్యాలి

-సుస్థిర ప్రతిపాదనలు రూపొందించి నిర్దుష్టమైన కార్యకలాపాలు నిర్వహించండి
-జూనియర్, యూత్ సభ్యత్వం పై దృష్టి పెట్టాలి
-మండలస్థాయి రెడ్ క్రాస్ సొసైటీ ఉప శాఖలను ఏర్పాటు చేయాలి
-జిల్లా కలెక్టర్, ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షులు కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజోపకరమైన కార్యక్రమాలను అమలు చేయడం కోసం నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ , ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షురాలు డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా శాఖ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ లో మరింత మందిని సభ్యులు గా నమోదు చేయడం ద్వారా మరిన్ని కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు మేలు కలుగచేసే, సామాజిక చైతన్యాన్ని కలుగ చేసే కార్యక్రమాలు చేపట్ట వలసి ఉందన్నారు. అందులో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా జూనియర్, యూత్ రెడ్ క్రాస్ సభ్యత్వాలను పెంచడం కోసం జిల్లా స్థాయి లో జూనియర్ అండ్ యూత్ ఐ ఆర్ ఎస్ సబ్ కమిటీ ను ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా ఇన్స్టిట్యూట్ ద్వారా జూనియర్, యూత్ కమిటీ లను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థి విభాగంలో జే ఆర్ సి రూ.20, వై ఆర్ సి రూ.30 లతో సభ్యత్వ నమోదు చేయాలన్నారు. గత ఏడాదిగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు పై సమీక్ష నిర్వహించారు. మన జిల్లా విభాగాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేసే విధానం పై నిర్దుష్టమైన ప్రతిపాదన తో తదుపరి సమావేశం నాటికి రావాలన్నారు. ఇకపై ప్రతి శనివారం జిల్లా రెడ్ క్రాస్ పనులపై సమీక్ష నిర్వహిస్తామని మాధవీలత తెలిపారు. రెడ్ క్రాస్ యొక్క కోర్ ఆక్టివిటీ పై ప్రజల్లో అవగాహన కలిగించి నిర్దుష్టమైన ప్రతిపాదనలు పటిష్టంగా అమలు చేయడం ద్వారా మన జిల్లా శాఖ కు ప్రత్యేక గుర్తింపు చేద్దాం అని కలెక్టర్ మాధవీలత పిలుపు నిచ్చారు. అంబులెన్స్ ప్రారంభం;జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రూ.9 లక్షలతో కొనుగోలు చేసిన అంబులెన్స్ ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ వై.. మధుసూదన్ రెడ్డి వివరాలు తెలుపుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఈ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకుని 5రావడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి, మరణించి వ్యక్తుల్ని అంతిమ యాత్ర కోసం ఈ వాహనాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, డిఆర్వో జి. నరసింహులు, రెడ్ క్రాస్ చైర్మన్ వై మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి జక్కంపూడి విజయలక్ష్మి, ట్రెజరర్ సునీల్, వైస్ చైర్మన్ దాల్ సింగ్, ఎంసీ సభ్యులు గొట్టిముక్కల అనంతరావు,  డా జీఎన్ మహాలక్ష్మి, లంకా సత్యనారాయణ, కె . శ్రీనిధి, బి. లక్ష్మణ రావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *