Breaking News

అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం సైన్స్ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించే క్రమంలో సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం సాయంత్రం సైన్స్ సెంటర్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ అధికారి జే డి రావు సైన్స్ సెంటర్ కి చెందిన పలు అంశాలను తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత మాట్లాడుతూ స్థానికంగా పేర్కొన్న సమస్యలపై ఆర్ అండ్ బి, పంచాయతీ , ఆర్ డబ్ల్యూ ఎస్, రెవెన్యూ, టిడ్కో ,  తదితర శాఖల అధికారులు ఆయా శాఖల పరంగా తీసుకోవలసిన చర్యలపై నివేదిక అందచేయాలని ఆదేశించారు. సివిల్ పనులకు చెందిన అంచనాలు సిద్దం చెయ్యాలని ఆర్ అండ్ బి , ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజినీరింగ్ అధికారులు స్పష్టం చేశారు. అంతకు ముందు సైన్స్ సెంటర్ అధికారులు డ్రైనేజీ వ్యవస్థ, కాంపౌండ్ వాల్ కి చెందిన సమస్యని కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్శన లో సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జెడి రావు, ఫీల్డ్ ఆఫీసర్ పి సత్యనారాయణ, హార్టికల్చరిస్టు సీఎన్. స్వామి, ఆర్ అండ్ బి ఎస్ ఈ – ఎస్బివి రెడ్డి, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి.స్వామి నాయుడు, ఎస్ ఈ పి ఆర్ – ఎ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్డబ్ల్యుఎస్ – డి. బాల శంకరరావు, డిపిఓ జె. సత్యనారాయణ, రాజమండ్రి రూరల్ తాహాసిల్దార్ పి.చిన్నారావు, సైన్స్ సెంటర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *