విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బడిపిల్లలకు మధ్యాహ్నభోజన పథకంలో నాణ్యమైన భోజనం పెట్టాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు. ఆదివారం మహాత్మాగాంధీని గాడ్సే హత్యచేసిన రోజుకు నిరసనగా ప్రతి నెలా 30వ తేదీన ఆయన కళ్లకు గంతలతో ఒకరోజు నిరాహారదీక్ష చేస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మీడియాతో మాట్లాడుతు గాంధీ, అంబేద్కర్ మార్గాలలో అహింస పాలన, మంచివిధానంకై అడుగులు వెయ్యాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రజల సహకారంతోనే విజయవంతం కాగలదని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను మీరు క్వాలిటీ మద్యం ఇవ్వడం కన్నా విద్యార్థుల కు మంచి భోజనం పెట్టాలని కోరుతూ లేఖ వ్రాసినా తగిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసారు. తమిళనాడులో కామరాజ్ భారతదేశంలో మొట్ట మొదట పేదపిల్లలు ఆకలితోఎలా చదవగలరు అన్న ప్రశ్న ప్రజలలో నుండి తెలుసుకొని మద్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటుచేసారని, ఆయన కూడ అదే రేషన్ బియ్యాన్ని తినేవారన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీరామారావు తెచ్చిన ఈ పథకాన్ని సక్రమంగా అమలుచేసేంత వరకూ వివిధ రూపాల్లో తన ఆందోళన కొనసాగిస్తానని గాంధీ నాగరాజన్ స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏపీ బాధ్యురాలు బంగారు భారతి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …